ఆపిల్ ఐఫోన్5 ఎఫెక్ట్.. తగ్గనున్నసామ్‌సంగ్ స్మార్ట్‌‌ఫోన్ ధర?

Posted By: Super

ఆపిల్ ఐఫోన్5 ఎఫెక్ట్.. తగ్గనున్నసామ్‌సంగ్ స్మార్ట్‌‌ఫోన్ ధర?

 

100 రోజుల్లో 20 మిలియన్ యూనిట్లు అమ్ముపోయి, ప్రపంచవ్యాప్తంగా  ది బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా  గుర్తింపుతెచ్చుకున్న  ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3’ తన పరపతిని మరింత పెంచుకునే క్రమంలో ‘ధర తగ్గింపు’ అస్త్రాన్ని సంధించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ఎస్3 ప్రస్తుత ధర రూ.38,000గా ఉంది. త్వరలో ఈ ధరను రూ.34,900లకు కుదించే అవకాశముందని మార్కెట్ వర్గాల టాక్.

Read in English:

నిర్ణయం వెనుక కారణం..?

ఆపిల్, సామ్‌సంగ్‌ల మధ్య ముసురుకున్న ‘పేటెంట్ హక్కుల’ వివాదం ముదిరిపాకన పడటంతో ఇరు వర్గాలు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. హక్కులను అతక్రమించిన పలు సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను అమెరికన్ మార్కెట్ నుంచి బహిష్కరించాలంటూ ఆపిల్ కోర్టుకెక్కింది. ఈ ఆధిపత్య పోరులో ఆపిల్‌ను అధిగమించాలన్న లక్ష్యంతో సామ్‌సంగ్, ఐఫోన్5 అమ్మకాలను తగ్తించేందుకు ఈ ధర తగ్గింపు ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కు అప్ డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.38400, 32జీబి మెమెరీ వేరియంట్ ధర రూ.41,500.

ఐఫోన్ 5 ఫీచర్లు:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్

నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్

(8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం), ధర అంచనా ఇండియన్ మార్కెట్లో రూ.55,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot