ఐఫోన్ 5 పేలి మహిళ కంటికి గాయాలు!

|

ఇటీవల కాలంలో యాపిల్ ఫోన్ పేలి మహిళ మృతి చెందిన ఘటన చైనాల కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఉదంతం మొబైల్ ఫోన్ యూజర్‌లను అప్రమత్తం చేసింది. ఐఫోన్ 5 స్ర్కీన్ పేలి మహిళ కంటికి గాయమైన సంఘటన తాజాగా చైనాలో చోటుచేసుకుంది. జడ్‌డీ నెట్ ప్రచురించిన కథనం మేరకు ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. చైనా ప్రాంతానికి చెందిన లీ తన ఐఫోన్ 5 నుంచి మిత్రునితో 40 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడింది. ఆకస్మాత్తుగా ఫోన్ స్ర్కీన్ భాగం నుంచి వెచ్చటి సెగ తన ముఖాన్ని తాకినట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లీ మీడియా ప్రతినిధులతో పేర్కొంది. అప్రమత్తమైన లీ ఫోన్ కాల్‌ను కట్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే ఫోన్ టచ్ స్ర్కీన్ ఏ మాత్రం స్పందించ లేదు. మరలా ప్రయత్నించే సరికి ఫోన్ స్ర్కీన్ నుంచి పేలుడు సంభవించి లీ కంటికి బలమైన గాయమైంది. వెంటనే స్పందించిన లీ సహచరులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఐఫోన్ 5 పేలి మహిళ కంటికి గాయాలు!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 పేలి అపార్ట్‌మెంట్ దహనం!

సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి ఇటీవల విడుదలైన స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్4'. అత్యాధునిక ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. అయితే ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న్ ఓ విషాదకర వార్త గెలాక్సీ ఎస్4 అభిమానులను భయాందోళనకు గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే, ప్రముఖ హాంగ్‌కాంగ్ వెబ్‌సైట్ ప్రచురించిన కథనం మేరకు... హాంగ్‌కాంగ్ దేశానికి చెందిన మిస్టర్ డూ తన గెలాక్సీ ఎస్4 స్మార్ట్‌ఫోన్‌లో లవ్ మెచీన్ గేమ్ ఆడుతున్నాడు. అదే సమయంలో ఫోన్ ఛార్జింగ్ అవుతోంది. ఆకస్మాత్తగా డూ చేతిలో ఉన్న ఫోన్ పేలింది. మంటలు వ్యాపించటంతో చేతిలో ఉన్న ఫోన్‌ను డూ విసిరేసాడు. దింతో అతను నివశిస్తున్న అపార్టుమెంట్ అగ్నికి అహుతయ్యింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఘటన పై స్పందించిన సామ్‌సంగ్ అధికారిక వర్గాలు ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతమవుతున్నాయి. ఏదేమైనప్పటికి మొబైల్ ఫోన్ వినియోగం విషయంలో జాగ్రత్తలు తీసుకోవల్సిన అవశ్యకత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ముఖ్యంగా చార్జింగ్పెట్టి ఉన్న ఫోన్ నుంచి మాట్లాడటం గాని పాటలు వినటంగాని చేయవద్దు. కంపెనీ ఫోన్‌లను మాత్రమే కొనుగోలు చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X