సెప్టెంబర్ మాసంలో షిప్పింగ్‌కు సిద్దమైనటువంటి ఐఫోన్ 5...!

Posted By: Super

సెప్టెంబర్ మాసంలో షిప్పింగ్‌కు సిద్దమైనటువంటి ఐఫోన్ 5...!

మొబైల్ ప్రియులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా ఐఫోన్ 5 విడుదలవుతుందా అని ఎదురు చూసే వారికి ఇది నిజంగానే శుభవార్త. పైన మీరు చూస్తున్నటువంటి ఇమేజిలో ఐఫోన్ 5కి సంబంధించినటువంటి సమాచారం వెలువడింది. టెక్నాలజీ రంగానికి సంబంధించినటువంటి న్యూస్‌ని అందించేటుటవంటి రిఊటర్స్ ఐఫోన్ 5కి సంబంధించినటువంటి న్యూస్ తన సైట్‌లో ప్రచురించింది. అది ప్రచురించినటువంటి న్యూస్ ప్రకారం ఐఫోన్ 5కి సంబంధించినటువంటి ప్రోడక్షన్ జులై లేదా ఆగస్టులో ప్రారంభం అవుతుందని అన్నారు. ఐఫోన్ 5 విడుదల కూడా సుమారు సెప్టెంబర్ నుండి ఉండవచ్చునని ఆ ఇమేజి సందేశం. సాధారణంగా జూన్, జులై షెడ్యూల్‌లో ఆపిల్ కంపెనీ ఐప్యాడ్‌లకు సంబంధించినటువంటి కొత్త అప్‌డేట్స్‌ని విడుదల చేస్తుంది.


ఇక ఐఫోన్ 5కి సంబంధించినటువంటి ఎటువంటి కొత్త సమాచారం మాకు అందిన మీతో పంచుకుంటాం. మాకు తెలిసినటువంటి సోర్సెస్ ప్రకారం ఐఫోన్ 5 కూడా ఐపోన్ 4 మాదిరే ఉంటుందని వినికిడి. కాకపోతే ఐఫోన్ 5 ప్రాసెసర్ గనుక ఐపోన్ 4తో పోల్చితే చాలా ఫాస్టుగా ఉంటుందంట. అప్పటి వరకు కూడా మీరు ఆగలేక పోయినట్లైతే మీకోసం ప్రత్యేకంగా ఈ వీడియో...

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot