ఏలా హింసించారో మీరే చూడండి.. (వీడియో)!

Posted By: Prashanth

ఏలా హింసించారో మీరే చూడండి.. (వీడియో)!

 

స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఆపిల్, సామ్‌సంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంటుంది. ఐఫోన్ 5 విడుదల ముందు వరకు గెలాక్సీ ఎస్3 కింగ్ మేకర్‌లా తన హావాను కొనసాగించింది. ఐఫోన్ 5 విడుదల అనంతరం పోటీ రసవత్తరంగా మారింది. ఈ రెండు గ్యాడ్జెట్‌లకు సంబంధించి ఓ మిలియన్ డాలర్ ప్రశ్న టెక్నాలజీ ప్రియులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ డివైజ్ల మన్నిక అలాగే మనుగడకు సంబంధించి అనేక విశ్లేషణలు వ్యక్తమవుతున్నప్పటికి ‘ఏది నెంబర్ వన్’అనే ప్రశ్నకు చాలా మంది దగ్గర జవాబు లేదు.

ఓ కఠిన పరీక్ష ఎవరు నెగ్గారు..?

బ్లెండర్స్, మిక్సర్స్ అలాగే గ్రెయిన్ మిల్స్‌ను తయారు చేయటంలో సుప్రసిద్ధ కంపెనీగా గుర్తింపుతెచ్చుకున్న బ్లెంటిక్ తమ ఉత్పత్తులు ఎంత శక్తివంతమైనవో నిరూపించేందుకు ‘ఐఫోన్5’ అలాగే ‘గెలాక్సీ ఎస్3’లకు సంస్థలు నిర్వాహకులు ఓ సహన పరీక్షకు పూనుకన్నారు. బ్లెంటిక్ షోస్ వ్యవస్థాపకులు టామ్ డిక్సన్ ఈ పరీక్షను నేతృత్వం వహించారు. పరీక్షలో భాగంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను వేరువేరు బ్లెండర్‌లలో వేసి కొద్ది నిమిషాలు పాటు ఒత్తిడికి లోను చేసారు. తరువాత ఏం జరిగిందో క్రింది వీడియోలో మీరే చూడండి.......

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot