మీ ఐఫోన్ 6 కోసం బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ చిట్కాలు

Posted By:

మీ ఐఫోన్ 6 కోసం బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ చిట్కాలు

మీ ఐఫోన్ 6 బ్యాటరీ పనితీరు విసుగు పుట్టిస్తోందా..?, బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతుందా..? ఈ చిట్కాలను పాటించటం ద్వారా సమస్యకు పరిష్కారం దొరికే అవకాశముంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఇప్పుడు మేము సూచిస్తోన్న చిట్కాలు ఒక్క ఐఫోన్ 6కు మాత్రమే కాదు ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే అన్ని ఐఫోన్ మోడల్స్‌కు వర్తిస్తాయి. ఈ చిట్కాలను అమలు చేసే ముందు మీ ఐఫోన్ 6 బ్యాటరీ లైఫ్‌ ఎంతో తెలుసుకోండి. ఆ వివరాలు మీకు తెలియాలంటే ముందగా ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి General>Usage>Battery Usageను చూడండి.

బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోటానికి ప్రధాన కారణం ‘యాప్ డ్రెయిన్'

మీ ఐఫోన్ 6 కోసం బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ చిట్కాలు

బ్యాటరీ లైఫ్ తగ్గటానికి ప్రధాన కారణం ‘యాప్ డ్రెయిన్'. ఫోన్ బ్యాక్ గ్రౌండ్‌లో మనకు తెలియకుండా అనేక అప్లికేషన్‌లు రన్ అవుతుంటాయి. బ్యాటరీలో అత్యధిక శాతం శక్తిని ఇవే గ్రహించుకుంటాయి. కాబట్టి, ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి General>Usage>Battery Usageను పరిశీలించి ఏఏ అప్లికేషన్ ఎంతంత శక్తిని వినియోగించుకంటుందో చూడండి. వాటిలో ఎక్కవ బ్యాటరీని తీసుకుంటూ నిరుపయోగంగా ఉంటున్న అప్లికేషన్‌లు ఏమైనా ఉంటే వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

ఫోన్ బ్రైట్నెస్‌ను అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా

మీ ఐఫోన్ 6 కోసం బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ చిట్కాలు

ఫోన్ బ్రైట్నెస్‌ను అడ్జస్ట్ చేసుకోవటం ద్వారా ఎంతో కొంత బ్యాటరీ ఆదా అవుతుంది. డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిస్‌ప్లే బ్రైట్నెస్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫోన్‌కు ఆటో లాక్‌ను ఏర్పాటు చేయటం ద్వారా కూడా బ్యాటరీ ఆదా అవుతుంది. ఇందుకు Settings>General>Auto-lockలోకి వెళ్లండి.

వై-ఫై ఇంకా 3జీని డిసేబుల్ చేయండి

మీ ఐఫోన్ 6 కోసం బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ చిట్కాలు

అవసరంలేని సమయంలో ఫోన్ వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీని డిసేబుల్ చేయటం ద్వారా బ్యాటరీ ఆదా అవుతుంది. వై-ఫైతో పోలిస్తే 3జీ కనెక్టువిటీ అత్యధిక శాతం బ్యాటరీని తీసుకుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అవసరంలేని సమయంలో అన్ని కనెక్టువిటీ ఆప్షన్‌లను డిసేబుల్ చేయండి.

ఎయిర్‌డ్రాప్‌ను టర్న్‌ఆఫ్ చేసి ఉంచండి

మీ ఐఫోన్ 6 కోసం బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ చిట్కాలు

ఐఫోన్ బ్లూటూత్ ఫీచర్ అయిన ఎయిర్‌డ్రాప్‌ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. ఎందుకంటే..? ఎక్కువ బ్యాటరీ శక్తిని గ్రహించుకునే ఫీచర్లలో ఇది కూడా ఒకటి.

మీ ఐఫోన్ 6 కోసం బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ చిట్కాలు

సాధారణంగా ఐఫోన్ 6, నెట్‌వర్క్ అందుబాటును బట్టి జీఎస్ఎమ్-ఎడ్జ్, 3జీ, 4జీ ఇలా రకరకాల నెట్‌వర్క్‌‌లకు కనెక్ట్ అవుతుంటుంది. వీక్ సిగ్నల్ జోన్‌కు వచ్చే సరికి ఫోన్ నెట్‌వర్క్ కోసం మరింత బ్యాటరీ శక్తిని ఖర్చు చేస్తుంటుంది. దీని వల్ల మనుకు ఏ విధమైన ఉపయోగం ఉండదు. ఇలాంటి సమయంలో ఫోన్‌ను ఎయిర్ ప్లేన్ మోడ్‌లో ఉంచటం ద్వారా బ్యాటరీ మరింత ఆదా అవుతుంది.

English summary
iPhone 6 Battery: Simple Tips for Longer Battery Life.Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot