లక్ష అడుగుల ఎత్తు నుంచి కిందపడినా చెక్కుచెదరని ఐఫోన్ 6

Posted By:

ఐఫోన్ 6తో సాహసోపేతమైన స్టంట్‌లు చేయాలనుకుంటున్న వారికి శుభవార్త. యాపిల్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 6 ఇప్పుడు లక్ష అడుగుల ఎత్తునుంచి క్రింద పడినప్పటికి చెక్కు చెదరదు. ఏలా అంటారా..? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కేస్‌ల తయారీ కంపెనీ ఆర్మోర్ గేర్ గత నవంబర్‌లో తాను రూపొందించిన ఐఫోన్ కేస్‌తో కూడిన ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను బెలూన్ సాయంతో ఆకాశంలోకి పంపింది.

ఆకాశం నుంచి కిందపడినా చెక్కుచెదరని ఐఫోన్ 6

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఫోన్ సుమారు లక్ష అడుగులు ఎత్తుకు వెళ్లిన తరువాత అక్కడి నుంచి జార విడిచారు. ఈ ఉత్కంఠభరిత చాలెంజ్‌లో ఆర్మోర్ గేర్ సంస్థ రూపొందించిన ఐఫోన్ కేస్ తన సత్తాను చాటుకుంది. అంత ఎత్తు నుంచి ఫోన్ క్రిందపడినప్పటికి ఏ మాత్రం దెబ్బతినలేదు. ఈ సాహసోపేతమైన వీడియోను CNET పోస్ట్ చేసింది.

బెలూన్ సాయంతో పోన్‌ను ఆకాశంలోకి పంపే క్రమంలో ఫోన్‌కు పారాచూట్‌తో పాటు రెండు గోప్రో కెమెరాలను అమర్చారు. ఫోన్ భూమి మీదకు చేరుకునే క్రమంలో 70 మైళ్ల వేగంతో కూడిన గాలులతో పాటు -70 డిగ్రీల ఫారెన్ హీట్‌ను తట్టుకోగలిగింది.

English summary
iPhone 6 drop tested from the edge of outer space. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot