ఒక్కసారిగా పేలిపోయిన ఐఫోన్ 6,కంపెనీ సమాధానం ఇదే

By Gizbot Bureau
|

చైనా ఫోన్లు పేలడం చూశాం.. శాంసంగ్ ఫోన్లు కాలిపోవడం చూశాం.. కానీ, ఇప్పుడు ఐఫోన్లు కూడా పేలుతున్నాయి. అత్యంత తక్కువ ధరకే కొన్న ఫోన్లు పేలిపోతున్నాయనే వార్తలు కలకలం రేపుతున్న తరుణంలో ఎంతో ఖర్చు పెట్టి కొన్న ఐఫోన్లు కూడా పేలడం కస్టమర్లను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.

11-Year-Olds iPhone 6 Catches Fire in the US: Report

రిచ్ స్టేటస్ చూపించుకోవడానికి కొందరు.. వ్యక్తిగత భద్రత దృష్ట్యా కొందరు ఆపిల్ కంపెనీ ఫోన్లనే కొంటుంటే ఆ ఫోన్లు కాలిపోతున్న ఘటనలు వినియోగదారులను, కంపెనీని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

11ఏళ్ల చిన్నారి

11ఏళ్ల చిన్నారి

వివరాల్లోకెళితే.. అమెరికాకు చెందిన 11ఏళ్ల చిన్నారి అప్పటి వరకు ఫోన్‌తో ఆడి పక్కనే పెట్టుకుని నిద్రపోయింది. చిన్నారి గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఫోన్‌ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఏదో కాలుతున్న వాసన వచ్చి వెంటనే దుప్పటి తొలగించి దూరంగా విసిరేసింది.

ఐఫోన్ 6 చూస్తుండగానే కాలి బూడిద అయింది

ఐఫోన్ 6 చూస్తుండగానే కాలి బూడిద అయింది

దానితో పాటే ఫోన్ కూడా పడిపోయి పెద్ధ శబ్ధంతో పేలి పోయింది. ఆపిల్ ఐఫోన్ 6 చూస్తుండగానే కాలి బూడిద అయింది. అదృష్టవశాత్తు పాపకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఐఫోన్ కాలిన ద‌‌‌ృశ్యాలను బాలిక తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

ఆపిల్ సపోర్టుకు కాల్

ఆపిల్ సపోర్టుకు కాల్

చిన్నారి తల్లి మారియా అడేటా వెంటనే ఆపిల్ సపోర్టుకు కాల్ చేసి కంప్లైంట్ చేసింది. దానికి కంపెనీ బాధ్యత వహిస్తూ ఫోన్ పేలడానికి గల కారణాలను విచారిస్తామని వెల్లడించింది. ఈ ప్రమాదంలో పాపకు ఏమీ కాలేదని తల్లి సంతోషంతో ఊపిరి పీల్చుకుంది.

 నెటిజన్ల వ్యంగ్య కామెంట్లు

నెటిజన్ల వ్యంగ్య కామెంట్లు

ఘటనపై స్పందించిన ఆపిల్ సంస్థ.. ఫోన్ కాలిన దృశ్యాలను తమకు పంపించాలని బాలిక తల్లిని కోరింది. అలాగే, ఆ ఫోన్‌ను తమ కంపెనీకి పార్శిల్ చేయాలని విన్నవించింది. కాగా, ఐఫోన్ కాలిపోవడంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఐఫోన్ కూడా చైనా ఫోన్‌గా మారిపోయిందంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు.

Best Mobiles in India

English summary
11-Year-Old's iPhone 6 Catches Fire in the US: Report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X