Apple Watch ద్వారా ఇజ్రాయెల్‌లో హమాస్ దాడిలో మరణించిన కుమార్తె మృతదేహాన్ని గుర్తించిన తండ్రి..!
ఆపిల్ ఐఫోన్, స్మార్ట్‌వాచ్‌లో ఉన్న కీలక ఫీచర్లతో ప్రాణాలు కాపాడిన సంఘటనలు గతంలో అనేకసార్లు వెలుగులోకి వచ్చాయి. కానీ తాజాగా ఓ కన్నీటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఐఫోన్, ఆపిల్ వాచ్ ద్వారా ఓ తండ్రి.. ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్ల దాడిలో మరణించిన తన కుమార్తె మృతదేహాన్ని గుర్తించాడు.
తాజాగా ఓ విషాద ఘటన వైరల్ అవుతోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు అకస్మికంగా దాడిచేశారు. ఒకవైపు రాకెట్లుతో మరోవైపు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి తుపాకులతో మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందిని బందీలుగా చేసుకున్నారు.

ఈ ఘటనలో మెల్లనాక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఇయల్ వోల్డ్‌మాన్ కుమార్తె డేనియన్ మరణించారు. ఇజ్రాయెల్‌లోని మ్యూజిక్ ప్రోగ్రాంకు స్నేహితుడితో వెళ్లిన డేనియల్ హమాస్ దాడిలో మరణించారు.ఈ ఘటన అనంతరం డేనియల్ ఫోన్ నుంచి వోల్డమన్ ఫోన్‌కు అత్యవసర కాల్ వచ్చింది. కానీ ఎటువంటి సమాచారం అందలేదు.
అయితే కుమార్తెను హమాస్ మిలిటెండ్లు బందీలుగా చేసుకొని ఉంటారని తొలుత భావించారు. అనంతరం కుమార్తె వినియోగిస్తున్న ఐఫోన్, ఆపిల్ వాచ్ ద్వారా లోకేషన్‌ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. ఘటన స్థలానికి సమీపంలోనే ఉన్నట్లు డేనియల్ ఆపిల్ వాచ్ నుంచి సిగ్నల్ వచ్చింది.

సిగ్నల్ అందిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. కుమార్తె మృతదేహం కనిపించింది. ఆమెతోపాటు వెళ్లిన డేనియల్ స్నేహితుడు మృతదేహం కూడా అక్కడే కనిపించింది. వారద్దరికి త్వరలో పెళ్లి చేయాలని భావించినట్లు వోల్డమన్ తెలిపారు. అంతలో ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడిచేశారు. అప్రమత్తం అయిన డేనియల్ అతని స్నేహితుడు కారులో తప్పించుకొనేందుకు ప్రయత్నం చేశారు. అయితే కారును చుట్టుముట్టిన హమాస్ మిలిటెంట్లు వారిపై తుపాకులతో వరుస కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు.
డేనియల్ ఐఫోన్‌లో క్రాష్ డిటెక్షన్ కాల్ టెక్నాలజీ ఉందని, అందువల్ల ప్రమాదం జరిగిన వెంటనే తనకు అత్యవసర కాల్ వచ్చినట్లు ఆమె తండ్రి వోల్డమన్ వెల్లడించారు. ఆ కాల్ రావడంతోనే తమ కుమార్తెను వెతుక్కుంటూ వెళ్లినట్లు తెలిపారు. అక్బోబర్ 7న ఇజ్రాయెల్‌లో భారీ సంగీత కచేరీ జరిగిందని, ఆ కార్యక్రమంలో తన కుమార్తె, ఆమె స్నేహితుడు పాల్గొన్నట్లు వోల్డమన్ తెలిపారు.
ఆపిల్ ఐఫోన్లు, వాచ్‌లో ఉన్న క్రాష్ డిటెక్షన్ కాల్ ఫీచర్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు.. ముందుగా అందించిన ఫోన్ నంబర్‌కు అలెర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఆ ప్రాంతం లోకేషన్‌ను కూడా షేర్ చేస్తుంది. ఫలితంగా తమ ఆత్మీయులను త్వరగా కాపాడుకొనేందుకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి ఫీచర్లు ఆపిల్ ఫోన్లలో చాలా ఉన్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








