చైనాలో లక్ష దాటిన యాపిల్ ఐఫోన్ ప్రీ బుకింగ్స్

Posted By:

యాపిల్ నుంచి ఇటీవల ఆవిష్కరించడిన సరికొత్త స్మార్ ఫోన్ లు ఐఫోన్ 5ఎస్ ఇంకా ఐఫోన్ 5సీలకు చైనా మార్కెట్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ చైనా యునీకామ్ వద్ద ఇప్పటి వరకు ఐఫోన్ 5ఎస్ ఇంకా ఐఫోన్ 5సీ డివైజులను లక్షమందికి పైగా ఆడ్వాన్స్ బుకింగ్ చేసుకునట్లు ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ Weibo పేర్కొంది. చైనా మార్కెట్లో యాపిల్ కొత్త ఐఫోన్ లను సెప్టంబర్ 20 నుంచి విక్రయించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ అమ్మకాలను మరింత పెంచుకునే కమ్రంలో యాపిల్ చైనా పై తన దృష్టిని కేంద్రీకరించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 చైనాలో లక్ష దాటిన యాపిల్ ఐఫోన్ ప్రీ బుకింగ్స్

ఐఫోన్ 5ఎస్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

ఐఫోన్ 5సీ స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్త ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0. సెప్టంబర్ 13 నుంచి ప్రీఆర్డర్ పై: ఐఫోన్ 5సీ సెప్టంబర్ 13 నుంచి ప్రీఆర్డర్ పై లభ్యం కానుంది. ఐఫోన్ 5సీ, 16జీబి వేరియంట్ ధర $99

(యూఎస్ మార్కెట్లో రెండు సంవత్సరాల కాంట్రాక్టు పై). ఐఫోన్ 5సీ 32జీబి వేరియంట్ ధర $199 (యూఎస్ మార్కెట్లో రెండు సంవత్సరాల కాంట్రాక్టు పై). సెప్టంబర్ 20న యూఎస్, చైనా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపార్ ఇంకా సింగపూర్ దేశాల్లో ఐఫోన్ 5సీని ఆవిష్కరించనున్నారు. డిసెంబరు నాటికి 100 దేశాల్లో ఐఫోన్ 5సీ లభ్యంకానుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting