జేబులో పేలిన ఐఫోన్, శరీరం నుంచి కాలిన వాసన

|
జేబులో పేలిన ఐఫోన్, శరీరం నుంచి కాలిన వాసన

ఓ ఐఫోన్ అనుమానాస్పద రీతిలో ఫ్యాంట్ జేబులో పేలిన వార్త ఇంటర్నెట్ ప్రపంచంలో కలకలం రేపుతోంది. బాధితుడు ఎరిక్ జాన్సన్ (29) ఓ అంతర్జాతీయ న్యూస్ వెబ్‌సైట్‌కు తెలిపిన వివరాల మేరకు.. ఎరిక్ ఓ పార్టీలో నిమగ్నమై ఉన్నాడు. ఆకస్మాత్తుగా తన కాలు బర్న్ అవటం ప్రారంభించింది. తన జేబులోని ఫోన్ పేలుడుకు గురైందని నిర్థారించుకున్న ఎరిక్ తన జేబులో నుంచి ఫోన్ ను బయటకు తీసే ప్రయత్నం చేసాడు.

జేబులో పేలిన ఐఫోన్, శరీరం నుంచి కాలిన వాసన

అయితే, ఆ ప్రయత్నం విఫలం కావటంతో ఫ్యాంట్ తొలగించి దూరం విసేరేసాడు. అక్కడ ఉన్నవారిలో కొందరు తన శరీరం నుంచి వచ్చిన కాలిన వాసనను గమనించినట్లు అతుడు ఏబీసీ 7కు తెలిపాడు. ప్రమాదం నుంచి థర్డ్ డిగ్రీ గాయాలతో బయట పడిన ఈ న్యూయార్కర్ 10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవల్సి వచ్చింది.

ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ లు పేలుడుకు గురువుతున్న సంఘటనలను అనేకం వింటున్నాం. ఐఫోన్ విద్యుత్ షాక్‌కు గురైన ఘటన చైనాలో కలకలం రేపింది. ఈ ఘటనలో గాయపడిన బాధితుడు 10 రోజులు కోమాలో స్థితిలో ఉండాల్సి వచ్చింది. గెలాకక్సీ ఎస్2 బ్యాటరీలో పేలుడు సంభవించటంతో దక్షిణ కొరియాకు చెందిన స్కూల్ విద్యార్థి గ్వాన్జూ చేతులను కాల్చుకున్నాడు. ప్యాంట్ జేబీలో సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ పేలటంతో 55 ఏళ్ల వ్యక్తి గాయాలపాలయ్యాడు.

ద్రమత్తులో ఉన్న ఓ నెక్సూస్ ఎస్ స్మార్ట్‌ఫోన్ యజమాని తన ఫోన్ మంటల్లో చిక్కుకున్నట్లు గమనించాడు. మంటలు అడుగు ఎత్తులో ఎగసిపడుతున్నాయి. అప్రమత్తంకావటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 నుంచి హఠాత్తు పేలుడు సంభవించటంతో పనిలో నిమగ్నమై ఉన్న సదరు ఫోన్ యజమానికి తొడకు బలమైన గాయాలయ్యాయి. విచారణలో తేలిన విషయం ఏమిటంటే సదరు ఫోన్ లో ఉపయోగించిన బ్యాటరీ ఒరిజినల్‌ది కాదని తేలింది.

Best Mobiles in India

English summary
iPhone ‘exploded in man’s pocket. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X