కొత్త ఐఫోన్ కోసం అభిమానుల ఆరాటం.. వారానికి ముందే క్యూలో పడిగాపులు!

|

యాపిల్ కొత్త ఐఫోన్ ఆవిష్కరణ నేపధ్యంలో జపాన్‌లోని యాపిల్ ఫ్యాన్స్ కొత్త డివైజ్‌ను ముందుగానే దక్కించుకునేందుకు రోడ్ల పై పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో యాపిల్ ఐఫోన్ 5ఎస్ ఇంకా ఐఫోన్ 5సీలను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో బుధవారం నుంచే జపాన్ మార్కెట్లో యాపిల్ అభిమానుల హడావుడి మొదలైంది.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

కొత్త ఐఫోన్ కోసం అభిమానుల ఆరాటం.. వారానికి ముందే క్యూలో  పడిగాపులు!

image source- AFP

యాపిల్ ఐఫోన్‌లను జపాన్ మార్కెట్లో సెప్టంబర్ 20 నుంచి విక్రయించనున్నారు. ఈ నేపధ్యంలో పలువురు యాపిల్ అభిమానులు యాపిల్ ఫోన్‌లను విక్రయించే స్టోర్‌ల ఎదుట బుధవారం నుంచే తిష్ట వేసారు. ఓ 44 సంవత్సరాల జపనీస్ వ్యాపారవేత్త టోక్యో గ్లిట్జీ షాపింగ్ డిస్ట్రిక్ట్‌లోని యాపిల్ స్టోర్ ఎదుట ఐఫోన్5ను దక్కించుకునేందుకు వారం ముందు నుంచే క్యూలో ఉన్నారు.

కుపర్టినో దిగ్గజం యాపిల్ తన తరువాతి జనరేషన్ ఐఫోన్ 5ఎస్‌ను మంగళవారం కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఇదే కార్యక్రమంలో యాపిల్ తన మధ్య ముగింపు స్మార్ట్‌ఫోన్ ఐఫోన్5సీని కూడా యాపిల్ ఆవిష్కరించింది. ఐఫోన్5తో పోలిస్తే ఐఫోన్5ఎస్ అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లను కలిగి ఉంది.

ఐఫోన్ 5ఎస్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

టెక్నాలజీ ప్రపంచంలో గతకొంత కాలంగా టాక్ ఆఫ్‌ ద టౌన్‌గా నిలుస్తున్న చవక ధర యాపిల్ ఫోన్, ఐఫోన్‌5సీని కుపర్టినో దిగ్గజం యాపిల్ మంగళవారం కాలిఫోర్నియాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించింది. చవక ధర యాపిల్ ఫోన్ ఐఫోన్ 5సీ ఐదు కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఆవిష్కరణ కార్యక్రమంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ 5సీని ‘మోర్ ఫన్ అండ్ కలర్ ఫుల్' అంటూ అభివర్ణించారు. ఐఫోన్ 5సీ ఎల్లో, పింక్, గ్రీన్, బ్లూ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది.

ఐఫోన్ 5సీ స్పెసిఫికేషన్‌లు:

పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్త ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0.


Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X