జర్నలిజానికే కొత్త ప్రేరణగానిలిచింది!!

Posted By: Staff

జర్నలిజానికే కొత్త ప్రేరణగానిలిచింది!!

 

ఆపిల్ ఐఫోన్ రేంజ్ ఏ స్థాయికి పెరిగిందో చెప్పాటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. తాజాగా ఆపిల్ ఐఫోన్ మీడియా రంగానికి కొత్త ఊతాన్నిచ్చింది. అల్ జజీరా ఛానల్‌కు చెందిన పాత్రికేయడు సిరియన్ల తిరుగుబాటు పై ఐఫోన్ సాయంతో పూర్తి స్థాయి డాక్యుమెంటిరీని రూపొందించాడు.

దీనికి కారణం అక్కడి ప్రభుత్వం అల్ జజీరా కెమెరాలను బ్యాన్ చెయ్యటమే. ఈ చిన్ని సినిమా ఆరంభం నుంచి చివరి దారా కేవలం ఐఫోన్‌ను ఉపయోగించి చిత్రీకరణ జరిపారు. ఈ ప్రయోగం ఐఫోన్ సామర్ధ్యాన్ని బయటపెట్టిందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. .

సాహసోపేతమైన,  విభన్న తరహాలో వీడియోలను షూట్ చేసుకునేందుకు ఆపిల్ ఐపోన్ పూర్తి స్ధాయిలో సహకరించగలదని పై ఉదాహరణ రుజువుచేస్తుంది. భిన్నమైన ఆలోచనలతో కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టే పాత్రికేయులు ఇతర పరిశోధకులకు ఆపిల్ ఐఫోన్ చక్కటి నేస్తంగా అభివర్ణించవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 4ఎస్ ప్రధాన ఫీచర్లు:

*  3.5 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే( గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో),

*  ఐవోస్ 5 ఆపరేటింగ్ సిస్టం,

*  డ్యూయల్ కోర్ 1జిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

*  8 మెగా పిక్సల్  ప్రైమరీ కెమెరా ( హై క్వాలిటీ వీడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు),

*  బ్యాటరీ స్టాండ్ బై 200 గంటలు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting