ఫొటోలు కంప్యూటర్‌లోకి కాపీ చేయకుండా ఐఫోన్‌‌తో ప్రింట్ అవుట్ ఎలా?

Posted By: Super

ఫొటోలు కంప్యూటర్‌లోకి కాపీ చేయకుండా ఐఫోన్‌‌తో ప్రింట్ అవుట్ ఎలా?

మొబైల్‌, కెమేరా, ఐప్యాడ్‌... ఇలా దేంట్లో ఫొటోలు తీసుకున్నా ప్రింట్‌ ఇవ్వాలంటే కంప్యూటర్‌లోకి కాపీ చేయాల్సిందే. కానీ, ఐఫోన్‌తో తీసుకున్న ఫొటోలను ప్రత్యేక ప్రింటర్‌తో చిటికెలో ప్రింట్‌ తీసుకోవచ్చు. చిత్రంలో ప్రింటర్‌ అదే. పేరు కూడా 'ఐఫోన్‌ ఫొటో ప్రింటర్‌.' కనిపిస్తున్న మాదిరిగా ఫోన్‌ను ప్రింటర్‌లో డాకింగ్‌ చేసి కావాల్సిన ఫొటోను ప్రింట్‌ తీసుకోవచ్చు. ఉచిత డౌన్‌లోడ్‌ అప్లికేషన్‌ను ఫోన్‌లో న్‌స్టాల్‌ చేసుకుని ప్రింటర్‌కి అనుసంధానం అవ్వొచ్చు. క్రిస్టల్‌ క్లియర్‌ 300 డీపీఐ రిజల్యుషన్‌తో ప్రింట్‌ అవుతాయి. 4x6 ఫొటో షీట్‌పై ఒకటి నుంచి నాలుగు ఫొటోలను ఒకేసారి ప్రింట్‌ తీసుకోవచ్చు. ఐపాడ్‌ టచ్‌, ఐప్యాడ్‌ల్లో కూడా దీన్ని వాడుకునే వీలుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot