ఐఫోన్ ఎక్స్‌ఆర్ ధర రూ. 40 వేలు తగ్గింది !
స్మార్ట్ ఫోన్ రారాజు ఆపిల్ ఐఫోన్ అంటే ప్రతి ఒక్కరికీ చాలా మక్కువ ఉంటుంది. అయితే కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్నా దాని ధరలు చాలా ఎక్కువ కావడంతో అందరూ ఏం చేయలేకపోతుంటారు. అలాంటి వారి కోసం సువర్ణావకాశం కల్పిస్తోంది అమెజాన్.

ఇందులో భాగంగానే ఆపిల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపులో అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ కోలాహలంలో భాగంగా, ఐఫోన్ ఎక్స్‌ఆర్, ఐఫోన్ 6 ఎస్ , ఐఫోన్ 7లపై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది.

నేటితో ప్రారంభం
ఈ ప్రైమ్ డే ఆఫర్‌లో ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ రూ .40,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఆరు రంగుల్లో లభిస్తున్న ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఇంత కంటే తక్కువ ధరలో లభించడం నిజంగా కలగానే అనిపిస్తుంది. కాగా అమెజాన్ ప్రైమ్‌డే సేల్ జూలై 15-16 తేదీల వరకు జరగనుంది. ఈ విక్రయాల్లో సాధారణంగా ఆపిల్ ఉత‍్పత్తులపై భారీ డిస్కైంట్లను అందిస్తుంది. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న అమెజాన్ ఆపిల్ ఇతర ఉత్పత్తులపై భారీ తగ్గింపుతో పాటు, వివిధ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై కూడా భారీ డిస్కౌంట్లను అందించనుంది.

ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫీచర్లు
ఐఫోన్ ఎక్స్‌ఆర్ ఫీచర్ల విషయానికి వస్తే..6.1 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, ఏ12 బయోనిక్ ప్రాసెసర్, ఐపి 67 వాటర్ డస్ట్ రెసిస్టెంట్, 12ఎంపీ రియర్ కెమెరా, ముందుభాగాన 7ఎంపీ ట్రూడెప్త్ సెన్సార్, ఫేస్ ఐడి, లాంటివి ప్రధానంగా ఉన్నాయి. కాగా స్మార్ట్‌ఫోన్లపై దిగుమతుల సుంకాల నేపథ్యంలో ఆపిల్ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో తక్కువ ధరలతో ఐఫోన్లను అందుబాటులోకి తేవడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్
స్మార్ట్‌ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఆడియో డివైజ్‌లు, బ్లూటూత్ ఇయర్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ రాయితీలతో ముందుకొస్తోంది. అలాగే, కొన్ని కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తోంది.లాంచ్ కాబోతున్న స్మార్ట్‌ఫోన్లలో వన్‌ప్లస్ 7 మిర్రర్ బ్లూ కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఎల్‌జీ డబ్ల్యూ30 అరోరా గ్రీన్ వేరియంట్, వాటర్ ఫాల్ గ్రే వేరియంట్, ఒప్పో ఎఫ్11 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎం40 కాక్‌టైల్ ఆరంజ్ గ్రేడియంట్ వెర్షన్, 10.ఆర్ జీ2 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి.

భారీ డిస్కౌంట్లు ఆఫర్
అలాగే, శాంసంగ్ గెలాక్సీ ఎం20, రియల్‌మి యూ1, నోకియా 6.1 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎం10, షియోమి రెడ్‌మి 6 ప్రొ, నోకియా 5.1, శాంసంగ్ గెలాక్సీ ఎ8 స్టార్, షియోమీ రెడ్‌మి 6, వివో వి15 ప్రొ వంటి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.

ఒకేసారి రెండు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు బంపర్ ఆఫర్లు
ఇదిలా ఉంటే ఒకేసారి రెండు ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు బంపర్ ఆఫర్లను అందిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌డే సేల్ ఈ రోజునుంచే (జులై 15)ప్రారంభం, మరో దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను ఈ మధ్యాహ్నం నుంచి ప్రారంభించనుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును ఇరు సంస్థలు అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకోసం ప్రత్యేక సేల్‌ను ఈ ఉదయం 8 గంటలనుంచే ప్రారంభించింది ఫ్లిప్‌కార్ట్. జూలై 15-18వరకు ఈ మెగా సేల్‌ను నిర్వహించనుంది. వీటికి తోడు ఎస్‌బిఐ కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపే వినియోగదారులకు అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది. రియల్‌మి, నోకియా స్మార్ట్‌ఫోన్లు తగ్గింపు ధరల్లో లభ్యం కానున్నాయి.

తగ్గిన ఫోన్ల వివరాలు
రియల్‌మి ఫోన్ల ధరలు రూ .7,499 ప్రారంభ. నోకియా 5.1 ప్లస్‌ను రూ.9 999కు, పోకో ఎఫ్ 1 ను ప్రారంభ ధర రూ .19,999 కు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆసక్తి ఉన్న కస్టమర్లు కూడా వివో ప్రో 9 ను రూ .15,990కు కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మి నోట్ 6 ప్రో ధర 13,999 రూపాయల నుంచి, ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్ 1 ను రూ .4,999 కు, హానర్ 7 రూ .5,999కి లభిస్తుంది. అంతేకాదు వివో వి 11 ప్రో, వివో వి 11, ఒప్పో ఎఫ్ 9 ప్రోపై రూ .2,000 అదనపు తగ్గింపు ఉండనుంది.

టాబ్లెట్‌లపై తగ్గింపు
స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, టాబ్లెట్‌లపై కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. లెనోవా, ఆల్కాటెల్ టాబ్లెట్లను రూ.6,999కు అందుబాటులో ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ టాబ్ ఏ ధర 12,999 రూపాయలుగా ఉంది. స్మార్ట్ టీవీలు 21,999 రూపాయలు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లు 51,999 రూపాయల నుండి లభ్యం.

ఇతర ఆఫర్లు
ఎలక్ట్రానిక్స్, ఇతక ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు
గృహ ఉత్పత్తులు , ఫర్నిచర్ పై 40 నుండి 80 శాతం మధ్య తగ్గింపు.
పుస్తకాలు, బొమ్మలు, క్రికెట్ బ్యాట్ లాంటి క్రీడా వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్.
వాషింగ్ మెషీన్లు, టీవీ, ఇతర గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
దుస్తులు, బూట్లు 40 నుండి 80 శాతం వరకు తగ్గింపు
కిరాణా వస్తువులపై రూ .1 డీల్స్


Click it and Unblock the Notifications








