ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ SE 2020 పై రూ.16,000 వరకు డిస్కౌంట్ ఆఫర్!!మిస్ అవ్వకండి
స్మార్ట్‌ఫోన్ ఉపయోగం రోజురోజుకి పెరుగుతున్నది. ఎంత బడ్జెట్ ఫోన్లను ఉపయోగిస్తున్నప్పటికీ ఐఫోన్ బ్రాండ్ ఫోన్లను వాడాలని చాలా మందికి ఆశ ఉంటుంది. అయితే ఐఫోన్ SE (2020) ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో గొప్ప తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ విక్రయ సమయంలో iPhone SE (2020) ఇండియా ప్రారంభ ధర రూ. 27,999. ఆసక్తి గల కస్టమర్‌లు వారి పాత స్మార్ట్‌ఫోన్‌లను మార్చుకోవడం ద్వారా కూడా రూ.16,050 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. వివిధ బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే దుకాణదారులు iPhone 12 64GB మరియు 128GB వేరియంట్‌ల కొనుగోలుపై దాదాపు రూ. 10,000 ఆదా చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 4.7-అంగుళాల రెటినా HD డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు Apple A13 బయోనిక్ SoC ద్వారా శక్తిని పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ 12-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో వస్తుంది.

ఐఫోన్ SE 2020 ఫ్లిప్‌కార్ట్ తగ్గింపు ఆఫర్స్
iPhone SE (2020) ను Flipkartలో రూ.27,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే 128GB స్టోరేజ్ మోడల్‌ను రూ.32,999 ధర వద్ద మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 42,999 వద్ద పొందవచ్చు. ఇవే కాకుండా Apple హ్యాండ్‌సెట్ కొనుగోలుపై రూ.16,050 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ వార్షిక చందాను ఉచితంగా కస్టమర్‌లు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లలో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ అలాగే కెనరా బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది.

ఐఫోన్ SE 2020 స్పెసిఫికేషన్స్
ఐఫోన్ SE 2020 యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 4.7 అంగుళాల రెటీనా HD LCD డిస్ప్లే 750x1334 పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది . ఇందులో హాప్టిక్ టచ్ సపోర్ట్ అనే కొత్త ఫీచర్ ను అందించారు. ఐఫోన్ 11, ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ ఫోన్లలో అందించిన ఏ13 బయోనిక్ చిప్ నే ఇందులో కూడా అందించడం విశేషం. అలాగే ఐఫోన్ SE 2020 యొక్క కెమెరాల విషయానికి వస్తే దీని యొక్క వెనుకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాతో ప్యాక్ చేయబడి ఉంది. అలాగే దీని వెనుకవైపు LED ట్రూటోన్ ఫ్లాష్, స్లో సింక్ ఫీచర్లు కూడా ఉండటం విశేషం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 7 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 4G LTE, వైఫై 802.11ax, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇది ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ బటన్ ఫీచర్ ను మాత్రమే కలిగి ఉంది.

డిజైన్ పరంగా చూసినట్లయితే ఈ ఐఫోన్ SE 2020 సెప్టెంబర్ 2017లో లాంచ్ అయిన ఐఫోన్ 8 తరహాలో ఉంది. ఐఫోన్ 7 స్మార్ట్ ఫోన్ కు తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. ఐఫోన్ SE 2020 ఫోన్ 13.84 సెంటీమీటర్లు X 6.73 సెంటీమీటర్ల X 0.73 సెంటీమీటర్ల కొలతలతో ఉండి చాలా తక్కువగా 148 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








