iPhone SE 2020: రూ.4000 తగ్గింపుతో ఆపిల్ కొత్త ఫోన్ సేల్స్!!! త్వరపడండి...
ఆపిల్ సంస్థ విడుదల చేసిన ఫోన్లలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ SE 2020 త్వరలో ఈ నెలలో భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. దీని యొక్క సేల్స్ మే 20 తేదీ 12PM IST నుండి మొదలుకానున్నాయి. ఆపిల్ యొక్క A13 బయోనిక్ చిప్‌సెట్‌తో ఐఫోన్ SE 2020 ను లాంచ్ చేసారు. ఇది 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను వివిధ ఎంపికలలో లభిస్తుంది.

ధరల వివరాలు
ఆపిల్ సంస్థ సాధారణంగా చాలా ఖరీదైన ధరల వద్ద మాత్రమే ఫోన్లను విడుదల చేస్తుంది. కానీ అదృష్టవశాత్తూ ఐఫోన్ SE సిరీస్ దానికి బిన్నంగా తక్కువ ధర వద్ద లాంచ్ అయింది. ఆపిల్ కొత్త ఐఫోన్ SE 2020 ను మూడు వేరియంట్ లలో విడుదల చేసింది. ఇందులో 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చే బేస్ వేరియంట్ యొక్క ధర రూ.42,500 కు విడుదల చేసింది. అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.47,800. చివరిగా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.58,300.

సేల్స్ ఆఫర్స్
ఆపిల్ సంస్థ ఏప్రిల్‌లో తన "సరసమైన" ఐఫోన్ SE (2020) ను రూ. 42,500 ధర వద్ద లాంచ్ చేసింది. మీరు హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ మరియు ఈజీఇఎమ్‌ఐతో కొనుగోలు చేస్తే, మీరు తక్షణమే రూ .3,600 తగ్గింపు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరగబోయే సేల్స్ లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వినియోగదారులకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. అందులో భాగంగా ఐఫోన్ SE(2020) యొక్క 64GB వేరియంట్ ను డిస్కౌంట్ ఆఫర్లలో భాగంగా రూ.38,900 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే లభిస్తుంది.

ఐఫోన్ SE 2020 స్పెసిఫికేషన్స్
ఐఫోన్ SE 2020 ఐఫోన్ 8 లాగా 4.7-అంగుళాల రెటీనా HD డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని యొక్క ఎగువ మరియు దిగువ భాగంలో మందపాటి బెజెల్స్ నిర్మాణం కలిగి ఉంటాయి. ఇది ఐఫోన్‌లు కలిగి ఉన్న భౌతిక క్లాసిక్ హోమ్-బటన్‌ను కలిగి ఉంది. ఐఫోన్ SE 2020 ఫోన్ రెడ్, వైట్ మరియు బ్లాక్ కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.

దానితో పాటు ఫోన్ యొక్క వెనుక భాగంలో గ్లాస్ ప్యానెల్ నిర్మాణంను కలిగి ఉంటుంది. అంటే ఈ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వగలదు. ఈ ఫోన్ వెనుక భాగంలో 12MP సింగిల్ కెమెరాతో వస్తుంది. దీని ద్వారా మీరు 4K వీడియోలను కూడా రికార్డ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 7MP సెల్ఫీ కెమెరా లెన్స్ ను కలిగి ఉన్నాయి. ఇది ట్రూ టోన్ డిస్ప్లే, డ్యూయల్ సిమ్ స్లాట్లు (eSIM + ఫిజికల్) మరియు హాప్టిక్ టచ్ కనెక్టవిటీలను కలిగి ఉంటుంది. ఒకే ఛార్జీలో వీడియోలను చూడటానికి మీరు 13 గంటల వరకు ఉపయోగించవచ్చని ఆపిల్ తెలిపింది.


Click it and Unblock the Notifications








