యాపిల్ రూ.10,000 ఫోన్‌ను రూ.40,000కు అమ్ముతోందా..?

By Sivanjaneyulu
|

4 అంగుళాల స్ర్కీన్ సైజులో యాపిల్ సంస్థ అభివృద్థి చేసిన iPhone SE మరికొద్ది రోజుల్లో భారత్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.39,000గా ఉండొచ్చని ఓ అంచనా. ఈ నేపథ్యంలో యాపిల్ కొత్త ఐఫోన్ కు సంబంధించి ఆసక్తికర సమాచారం వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రముఖ రిసెర్చ్ సంస్థ IHS చెబుతోన్న దాని ప్రకారం iPhone SE వాస్తవ తయారీ ఖర్చు 160 డాలర్లేనట (మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.10,500).

యాపిల్ రూ.10,000 ఫోన్‌ను రూ.40,000కు అమ్ముతోందా..?

యూఎస్ మార్కెట్లో iPhone SEని 399 డాలర్లకు యాపిల్ విక్రయిస్తోంది. అంటే ఎంత లాభమో చూస్కోండి. 64జీబి iPhone SEని తయారు చేసేందుకు యాపిల్ కు అయ్యే ఖర్చు 170 డాలర్లే నట (మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.11,232). ఇటీవల మార్కెట్లో విడుదలైన యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ వాస్తవ తయారీ వివరాలను కూడా IHS సంస్థ ఇటీవల బహిర్గతం చేసింది. ఈ సంస్థ చెబుతోన్న దాని ప్రకారం ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ తయారీ అయ్యే ఖర్చు కేవలం 17,000నట. మార్కెట్లో ఈ ఫోన్ ఖరీదు మాత్రం 51,000. అంటే 3 రెట్లు ఎక్కువనమాట.

Read More : తక్కువ ఖర్చుతో కంప్యూటర్‌ను తయారు చేయటం ఎలా..?

ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీ గురించి షాకింగ్ నిజాలు..?

ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీ గురించి షాకింగ్ నిజాలు..?

ఐఫోన్ 6ఎస్ ప్లస్ (16జీబి వర్షన్) తయారీకి అవసరమయ్యే ముడి మెటీరియల్ ఖర్చు 15,800 మాత్రమేనట. తయారీ వ్యయంతో కలుపుకుంటే 17,000 అవుతుందట.

ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీ గురించి షాకింగ్ నిజాలు..?

ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీ గురించి షాకింగ్ నిజాలు..?

ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఫోన్‌కు 3డీ టచ్ ఫీచర్ ప్రధాన కాంపోనెంట్‌గా నిలుస్తుంది. స్ర్కీన్‌లా ఉండే ఈ కాంపోనెంట్ ఖరీదు 3,580 మాత్రమేనట.

ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీ గురించి షాకింగ్ నిజాలు..?

ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీ గురించి షాకింగ్ నిజాలు..?

 ఫోన్ ముందు, వెనుక భాగాల్లో కెమెరాలను ఏర్పాటు చేసేందుకు అయిన ఖర్చు 1,530 అట.

ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీ గురించి షాకింగ్ నిజాలు..?

ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీ గురించి షాకింగ్ నిజాలు..?

ఫోన్ 6ఎస్ ప్లస్ ఫోన్ 64జీబి వర్షన్‌ను సొంతం చేసుకోవాలంటే అదనంగా 7,000 చెల్లించాల్సి ఉంటుంది. తయారీ విషయానికి వచ్చేసరికి 64జీబి వర్షన్ తయారీకి 16జీబి వర్షన్‌తో పోలిస్తే అదనంగా 1200 మాత్రమే ఖర్చవుతుందట.

ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీ గురించి షాకింగ్ నిజాలు..?

ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీ గురించి షాకింగ్ నిజాలు..?

ఒక్క ఐఫోన్ యూనిట్‌ను పూర్తిగా అసెంబుల్ చేయాలంటే 24 గంటల సమయం పడుతుందట. ఇంత కష్టపడుతున్న కార్మికులకు యాపిల్ చెల్లిస్తున్న మొత్తం గంటకు 120 మాత్రమేనట.

ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీ గురించి షాకింగ్ నిజాలు..?

ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీ గురించి షాకింగ్ నిజాలు..?

రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, షిప్పింగ్, లైసెన్సింగ్, మార్కెటింగ్ ఇంకా ఇతర తృతీయ ఖర్చులను కలుపుకున్నప్పటికి ఒక్కో ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ యూనిట్ పై యాపిల్‌కు భారీ స్థాయిలోనే లాభాలు ఉంటాయి.

ఐఫోన్ ఎస్ఈ  ప్రత్యేకతలు

ఐఫోన్ ఎస్ఈ ప్రత్యేకతలు

ఐఫోన్ 5ఎస్ సైజులో ఉండే ఈ ఫోన్‌లో ఐఫోన్ 6ఎస్ తరహా స్పెక్స్‌ను యాపిల్ పొందుపరిచింది.

ఐఫోన్ ఎస్ఈ  ప్రత్యేకతలు

ఐఫోన్ ఎస్ఈ ప్రత్యేకతలు

4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే

ఐఫోన్ ఎస్ఈ  ప్రత్యేకతలు

ఐఫోన్ ఎస్ఈ ప్రత్యేకతలు

యాపిల్ ఏ9 సాక్, ఎం9 మోషన్ కోప్రాసెసర్ విత్ ‘Hey Siri' ఫీచర్ ఐఓఎస్ 9.3 ఆపరేటింగ్ సిస్టం,

ఐఫోన్ ఎస్ఈ  ప్రత్యేకతలు

ఐఫోన్ ఎస్ఈ ప్రత్యేకతలు

12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా (లైవ్ ఫోటోస్ ఇంకా 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్),

ఐఫోన్ ఎస్ఈ  ప్రత్యేకతలు

ఐఫోన్ ఎస్ఈ ప్రత్యేకతలు

1.2 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా విత్ రెటీనా ఫ్లాష్,

ఐఫోన్ ఎస్ఈ ప్రత్యేకతలు

ఐఫోన్ ఎస్ఈ ప్రత్యేకతలు

1.2 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా విత్ రెటీనా ఫ్లాష్,

ఐఫోన్ ఎస్ఈ ప్రత్యేకతలు

ఐఫోన్ ఎస్ఈ ప్రత్యేకతలు

4జీ ఎల్టీఈ సపోర్, బ్లుటూత్ 4.2, వై-ఫై కనెక్టువిటీ, సరికొత్త మైక్రోఫోన్ వ్యవస్థ

Best Mobiles in India

English summary
iPhone SE costs Apple around Rs 10,500 to make, says IHS.Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X