Home
News

డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌, సింగిల్ కెమెరాతో ఐఫోన్‌ SE.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..?

ఆపిల్‌ ప్రస్తుత ప్రీమియం స్మార్ట్‌ఫోన్లతోపాటు ఐఫోన్‌ SE ఫోన్లు కూడా ఉన్నాయి. అయితే ఐఫోన్ SE (iPhone SE) కొత్త ఫోన్‌ విడుదల చేసి చాలా కాలం అయింది. ఆఖరిసారిగా 2022 మార్చిలో ఐఫోన్‌ SEను విడుదల చేసింది. అయితే తాజాగా నెక్ట్స్‌ జనరేషన్ ఐఫోన్ SE స్మార్ట్‌ఫోన్‌ పైన అనేక వార్తలు వస్తున్నాయి.

ఐఫోన్ SE యాపిల్‌ ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కొత్త ఫోన్‌ డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌ కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ఐఫోన్‌ XR తరహాలో సింగిల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని సమాచారం. దీంతోపాటు డిజైన్‌ మార్పులు కూడా ఉంటాయని తెలుస్తోంది.

iPhone SE could feature Dynamic island

టిప్‌స్టర్‌ మజిన్‌బూ ఆధారంగా ఐఫోన్ SE మోడల్‌ ఐఫోన్‌ 16 మాదిరిగా కనిపిస్తుందని కానీ కాస్త చిన్నగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ వెనుక కెమెరాలో రెండు లెన్స్‌లకు బదులుగా ఒకే లెన్స్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే ఇతర ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

అయితే ఐఫోన్‌ SE ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు. ఈ ఫోన్ 2025 విడుదల కానుందని కొన్ని నివేదికలు చెబుతుండగా.. మరికొన్ని మాత్రం ఈ సంవత్సరంలోనే అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. కొ‌త్త ఐఫోన్ల మాదిరిగా టచ్‌ ఐడీకి బదులుగా ఫేస్‌ IDను వినియోగించే అవకాశం ఉంటుంది. వెనుక కెమెరా వద్ద కూడా ఫేస్‌ ఐడీ ఉండే అవకాశం ఉంది. ఐఫోన్‌ 14 మాదిరిగా నాచ్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. ఐఫోన్ 15 తరహాలో నాణ్యమైన సెన్సార్‌తో కూడిన పెద్ద కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 16 మాదిరిగా A17 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. మరియు ఐఫోన్ 14 తరహాలో పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. అయితే ఇవన్ని కేవలం ఉహాగానాలు మాత్రమే. ఐఫోన్‌ SE స్మార్ట్‌ఫోన్‌ వివరాలపై ఆపిల్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

దీంతోపాటు ఆపిల్‌ సంస్థ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను తయారు చేయనుందనే వార్తలు వస్తున్నాయి. కనీసం రెండు ప్రోటోటైప్‌ ఫోన్లను అభివృద్ధి చేస్తు్న్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోల్డబుల్‌ ఐఫోన్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే వివరాలు వెల్లడి కాలేదు. ప్రోటోటైప్‌ డిజైన్‌ పై సంస్థ సంతృప్తి చెందాకా ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది.

కొన్ని నివేదికల ఆధారంగా ఆపిల్ సంస్థ రెండు క్లామ్‌షెల్ మోడల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ మోడల్‌ ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ Z Flip తరహా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సమాంతరంగా మడతపెట్టే విధంగా ఉంటుంది. ఈ ఫోన్లు ప్రస్తుతానికి ప్రోటోటైప్‌ మోడళ్లుగానే ఉంటాయని తెలుస్తోంది.

ఐఫోన్‌ ఫోల్డబుల్‌ డివైస్‌లకు అవుటర్‌ డిస్‌ప్లే కలిగి ఉండాలని, ఫోల్డింగ్‌ చేసినప్పుడు కనిపించేలా ఉండాలని ఆపిల్‌ తన ఇంజినీర్లకు నిర్దేశించినట్లు తెలుస్తోంది. అయితే ఈ డిజైన్‌ త్వరగా బ్రేక్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత ఐఫోన్ల మాదిరిగా సన్నగా ఉండేలా డిజైన్‌ను రూపొందించాలని భావిస్తున్నట్లు సమాచారం.

విడిభాగాల కోసం కీలక ప్రయత్నాలు : అయితే ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌.. బ్యాటరీ, డిస్‌ప్లే విడిభాగాల కారణంగా కొంచెం మందంగా ఉండే అవకాశం ఉంది. ఆపిల్‌ సంస్థ ఈ రెండు ప్రోటోటైప్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్ల విడిభాగాల కోసం ఆసియాలోని విడిభాగాల సరఫరాదారుడిని సంప్రదించినట్లు తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
iPhone SE New Gen Smartphone may have Dynamic island feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X