ఐఫోన్ యూజర్లు మాహా తెలివైనా వారు!!

|

మొబైల్ ఫోన్ బ్రాండ్ అనేది ఆ ఫోన్ వినియోగదారుడి అభిరుచి, జీవన శైలి, అలానే అతని ఆర్థిక స్తోమతను సూచిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే వారి మానసిక చురుకుదనానికి సంబంధించి తాజాగా నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చింది. యూఎస్‌కు చెందిన పుస్తకాల తయారీ సంస్థ లాడ్‌బ్రోక్స్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల మానసిక చురుకుదనాన్ని అంచనా వేసే క్రమంలో 1000 మంది స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఓ సర్వేను నిర్వహించింది.

 
ఐఫోన్ యూజర్లు మాహా తెలివైనా వారు!!

ఈ సర్వే నిమిత్తం ప్రత్యేకమైన ఆన్‌లైన్ అప్లికేషన్‌‌ను కంపెనీ తయారు చేసి వారి ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసింది. యాపిల్, సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ, బ్లాక్‌బెర్రీ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న 1000 మంది యూజర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. సదరు అప్లికేషన్‌లో లోడ్ చేసిన ప్రశ్నలకు వారు సమాధానిలిచ్చారు.

ఈ పరీక్షలో యాపిల్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మొదటి స్థానంలో నిలిచినట్లు సర్వే పేర్కొంది. 94 సెకన్ల కాలంలో వీరు ఈ పరీక్షను పూర్తి చేసారట. రెండు స్థానంలో నిలిచిన గూగుల్ నెక్సూస్ యూజర్లు పరీక్షను 99 సెకన్ల వ్యవధిలో పూర్తి చేసారట. మూడవ స్థానంలో నిలిచిన సామ్‌సంగ్ పరీక్షను 103 సెకన్ల వ్యవధిలో పూర్తి చేసినట్లు సర్వే పేర్కొంది. నాలుగో స్థానంలో నిలిచిన హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ యూజర్లు 105 సెకన్లలో పరీక్షను పూర్తిచేసారట. ఐదో స్థానంలో నిలిచిన నోకియా యూజర్లు 109 సెకన్ల కాలంలో పరీక్షను పూర్తి చేసారట. చివరి స్థానంలో నిలిచిన బ్లాక్‌బెర్రీ ఫోన్ యూజర్లు 118 సెకన్ల కాలంలో పరీక్షను పూర్తిచేసారు.

మీరు కూడా ఈ పరీక్షలో పాల్గొనాలనుకుంటున్నారా..? ఈ లింక్ పై క్లిక్ చేయండి atestofwits.latestcreativework.com

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X