ఐఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో ఏడాది ఉచితం

యాపిల్‌తో చేతులు కలిపిన రిలయన్స్ జియో ఐఫోన్ యూజర్లకు రూ.18,000 విలువ చేసే జియో నెట్‌వర్క్ సేవలను ఏడాది పాటు ఉచితంగా అందిస్తోంది. అంతేకాకుండా ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు 25శాతం రాయితీని కూడా జియో ప్రకటించింది.

Read More : ఈ దీపావళికి రాబోతోన్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే‌

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ రిటైల్ స్టోర్ ద్వారా...

ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఫోన్‌లను రిలయన్స్ రిటైల్ స్టోర్ లేదా యాపిల్ అధికారిక స్టోర్ ద్వారా కొనుగోలు చేసిన యూజర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

జియో వెల్‌కమ్ ఆఫర్ లో భాగంగా

జియో వెల్‌కమ్ ఆఫర్ లో భాగంగా ఐఫోన్ యూజర్లు డిసెంబర్ 31, 2016 వరకు అన్ని రకాల జియో సేవలు ఉచితంగా పొందవచ్చు.

జనవరి 1, 2017 నుంచి..

జనవరి 1, 2017 నుంచి, ఈ ఏడాది ఉచిత ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఇంచుమించుగా 15 నెలల పాటు జియో సర్వీసులను ఐఫోన్ యూజర్లు ఉచితంగా ఆస్వాదించవచ్చు.

రూ.1499 monthly ప్లాన్ బెనిఫిట్స్

జనవరి 1, 2017 నుంచి వర్తించే ఈ ఆఫర్‌లో భాగంగా 12 నెలల పాటు రూ.1499 monthly ప్లాన్ బెనిఫిట్స్ యూజర్లు పొందుతారు.

20 జీబి 4జీ డేటా, 40 జీబి వైఫై డేటా

ఈ ప్లాన్‌లో భాగంగా నెలకు 20జీబి 4జీ డేటాను వాడుకునే అవకాశం ఉంటుంది. అన్ని కాల్స్ ఉచితం, 40జీబి వైఫై డేటాను వాడుకొవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లను పంపుకోవచ్చు. జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone Users to Get Additional 12 Months of Reliance Jio Free Service. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot