ఐఫోన్‌లో కాల్ రికార్డింగ్ ఫీచర్.. ఎలా ఉపయోగించాలి, ఏమేం ప్రయోజనాలున్నాయి..?
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఇటీవలే ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయింది. మూడు రోజుల క్రితం ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల సేల్ ప్రారంభం అయింది. అయితే కొత్త OS వెర్షన్ iOS 18 ను విడుదల చేసింది. దీంతో అనేక ఫీచర్లు ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఈ తరహా ఫీచర్ల కోసం ఐఫోన్ యూజర్లు థర్డ్ పార్టీ యాప్‌ల పైన ఆధారపడేవారు. ఈ కొత్త OS వెర్షన్ ద్వారా కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఈ iOS 18 ఫీచర్‌ల గురించి వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో ఆపిల్ ప్రదర్శించింది. ప్రస్తుతం OS అప్‌డేట్ ద్వారా ఫోన్ యాప్ ద్వారానే కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంది. ఫోన్ కాల్ సమయంలో కాల్ రికార్డింగ్‌ను ఆఫ్ లేదా ఆన్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో కాల్‌లో మాట్లాడుకున్న అంశాలను Text రూపంలో పొందవచ్చు. టెక్స్ట్ రూపంలో కాల్ సారాంశం కావాలా వద్దా అనేది యూజర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ కోసం యూజర్లు iOS 18.1 బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఐఫోన్‌లో కాల్స్‌ను ఎలా రికార్డు చేయాలి?
ఐఫోన్‌లో కొత్త OS వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాక.. కాల్ చేయడం లేదా కాల్‌ను స్వీకరించాలి. కాల్ కనెక్ట్ అయ్యాక.. కాలింగ్ స్క్రీన్ పైన రికార్డు బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ పైన క్లిక్ చేశాక.. ఈ కాల్ రికార్డు చేయబడుతుంది అనే మెసెజ్‌ను మీకు చూపిస్తుంది. ఆ నోటిఫికేషన్‌ను Skip చేస్తే.. కాల్ రికార్డింగ్ నిలిచిపోతుంది. దీంతోపాటు Stop బటన్ ద్వారా ఆఫ్ చేసే అవకాశం కూడా ఉంది.
ఐఫోన్ iOS18 ద్వారా కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అయితే మీరు కాల్ రికార్డు చేస్తున్న విషయం అవతలి వ్యక్తులకు కూడా తెలుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. దీంతోపాటు మీ కాల్ సారాంశం కూడా పొందవచ్చు. దీంతోపాటు మీ కాల్స్ రికార్డింగ్స్ అన్నీ .. నోట్స్‌లోని కాల్ రికార్డింగ్స్ ఫోల్డర్‌లో గుర్తించవచ్చు.
ప్రస్తుతానికి కాల్ రికార్డింగ్‌ను టెక్ట్స్ రూపంలో కొన్ని భాషాల్లోనే పొందే అవకాశం ఉందని ఆపిల్ వెల్లడించింది. ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, జపానిస్, చైనీస్, పోర్చుగీస్ మరియు Cantonese భాషల్లోనే అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్‌లో విడుదలయ్యే కొత్త అప్‌డేట్‌లతో మరిన్ని భాషలను కూడా సపోర్టు చేసే అవకాశం ఉందని ఆపిల్ తెలిపింది.
* భారత్ మార్కెట్‌లో సెప్టెంబర్ 20 నుంచి ఐఫోన్ 16 సిరీస్ సేల్ ప్రారంభం అయింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. ఆపిల్ స్టోర్‌లో ఐఫోన్ 16 సిరీస్‌ను అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5000 తగ్గింపును పొందవచ్చు.
దీంతోపాటు 3 నుంచి 6 నెలలపాటు నోకాస్ట్ EMI సదుపాయాన్ని కూడా పొందవచ్చు. పాత ఐఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.67,500 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్ స్టోర్‌లతోపాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ఆఫ్‌లైన్ స్టోర్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 16 మోడల్ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,900 గా ఉంది. 256GB స్టోరేజీ ధర రూ.89,900, 512GB స్టోరేజీ ధర రూ.1,09,900 గా ఉంది. ఐఫోన్ 16 ప్లస్ మోడల్ 128GB స్టోరేజీ ధర రూ.89,900, 256GB స్టోరేజీ ధర రూ.99,900, 512GB స్టోరేజీ ధర రూ.1,19,900 గా ఉంది.
ఐఫోన్ 16 ప్రో మోడల్ 128GB స్టోరేజీ ధర రూ.1,19,900, 256GB స్టోరేజీ ధర రూ.1,29,900, 512GB స్టోరేజీ ధర రూ.1,49,900, 1TB స్టోరేజీ ధర రూ.1,69,900 గా ఉంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256GB స్టోరేజీ ధర రూ.1,44,900, 512GB స్టోరేజీ ధర రూ.1,64,900, 1TB స్టోరేజీ ధర రూ.1,84,900 గా ఉంది.


Click it and Unblock the Notifications








