ఐఫోన్ vs ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్: ఫీచర్స్ పరంగా ఏది బెస్ట్!!

|

ప్రపంచం మొత్తం మీద ఉన్న వినియోగదారులు మరొకరితో మాట్లాడటానికి ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ లను ఉపయోగించేవారు. అయితే తరువాత హ్యాండ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే తరువాత వీటి స్థానంలోకి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు రకరకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. చాలా సంస్థల మధ్య పోటీ ఉన్నప్పటికి ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ ల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నాయి. ఐఫోన్లను అమెరికాకు చెందిన ఆపిల్ సంస్థ తయారుచేస్తుంటే ఆండ్రాయిడ్ ఫోన్లను చాలా సంస్థలు విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా సంస్థలు అధికంగా ఆండ్రాయిడ్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ రెండు ఫోన్లలో ఉపయోగించే టెక్నాలిజీల మధ్య తేడాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐఫోన్ iOS ఫీచర్ టెక్నాలజీ

ఐఫోన్ iOS ఫీచర్ టెక్నాలజీ

ఐఫోన్లు అన్నిటిలోను ప్రస్తుతం iOS మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నారు. ఆపిల్ సంస్థ హార్డ్‌వేర్ విషయంలో కూడా ప్రత్యేకంగా కొత్త పద్దతులను అనుసరిస్తున్నది మరియు వాటిని అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. ఐఫోన్ మరియు ఐపాడ్ టచ్‌తో సహా సంస్థ యొక్క అనేక మొబైల్ డివైస్ లలో ios ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ తరువాత ప్రపంచంలో విస్తృతంగా అభివృద్ధి అయిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇది ఒకటి. ఆపిల్ సంస్థ తన ఐప్యాడోస్, టివిఓఎస్ మరియు వాచ్‌ఓఎస్ కోసం మరో మూడు ఆపరేటింగ్ సిస్టమ్‌లను తయారుచేస్తున్నది.

 

Also Read: Smart Devices కరోనా సమయంలో ఎంత వరకు ఉపయోగకరంగా ఉన్నాయి!!!Also Read: Smart Devices కరోనా సమయంలో ఎంత వరకు ఉపయోగకరంగా ఉన్నాయి!!!

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్
 

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్

ఆండ్రాయిడ్ అనేది స్మార్ట్ఫోన్లు మరియు టాబ్లెట్ వంటి మొబైల్ పరికరాల కోసం ఓపెన్ సోర్స్ మరియు లైనక్స్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్‌ను గూగుల్ నేతృత్వంలోని ఓపెన్ హ్యాండ్‌సెట్ అలయన్స్ మరియు ఇతర కంపెనీలు అభివృద్ధి చేశాయి. మొబైల్ పరికరాల కోసం యాప్ అభివృద్ధికి ఆండ్రాయిడ్ ఏకీకృత విధానాన్ని అందిస్తుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ మొదటి బీటా వెర్షన్‌ను గూగుల్ 2007 లో విడుదల చేసింది. జూన్ 27, 2012 న, గూగుల్ ఐ / ఓ కాన్ఫరెన్స్‌లో గూగుల్ తదుపరి ఆండ్రాయిడ్ వెర్షన్ 4.1 జెల్లీబీన్‌ను ప్రకటించింది. జెల్లీ బీన్ అనేది పెరుగుతున్న నవీకరణ, ఇది వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడం యొక్క ప్రాధమిక లక్ష్యంతో, కార్యాచరణ మరియు పనితీరు పరంగా. Android ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ లైసెన్సుల క్రింద లభిస్తుంది.

ఐఫోన్ vs ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ధరల పోలికలు

ఐఫోన్ vs ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ధరల పోలికలు

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మరియు ఐఫోన్ యొక్క ధరల పోలికల విభాగానికి వస్తే ఐఫోన్ యొక్క ధరలు ఇప్పటికి అధికంగా ఉన్నాయి. సామాన్యులు వీటిని కొనుగోలు చేసే విషయంలో మాత్రం అందని ద్రాక్షగానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు మాత్రం తక్కువ ధరలో కూడా లభిస్తున్నాయి. చైనా యొక్క స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం 5వేలు నుంచి కూడా లభిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
IPhone vs Android Smartphone: Which is The Best in Terms of Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X