ఐఫోన్ X కాదు...శాంసంగ్ గెలాక్సీ S8 కావలట!

By Madhavi Lagishetty
|

అమెరికాలో క్రిస్మస్ హాలిడేస్ మొదలయ్యాయి. తమకు ఇష్టమైన వారికి బహుమతులు ఇచ్చేందుకు...షాపింగ్ షురూ చేశారు. యుఎస్ లో ఆపిల్ కంపెనీ భారీ ప్రజాదరణ పొందింది. ఈ క్రిస్మస్ కు తమ ప్రియమైన వారికి ఐఫోన్లను గిఫ్ట్ గా ఇచ్చేందుకు యువకులు, పెద్దలు పోటిపడుతున్నారు.

iPhone X as a Christmas gift? No, most people want a Samsung Galaxy S8 in the US

అమెరికా మార్కెట్ రీసెర్చ్ సంస్థ ప్రొపెల్లర్ ఇన్ సైట్...ఈ మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం...అమెరికాలో 38శాతం మంది క్రిస్మస్ బహుమతిగా శాంసంగ్ గెలాక్సీ S8ను ఎంచుకుంటున్నారని... 20శాతం మాత్రమే క్రిస్మస్ బహుమతిగా ఆపిల్ ఐఫోన్ ఎక్స్ ను కోరకుంటున్నారని సర్వేలో తేలింది.

అంతేకాదు ఐఫోన్ X కంటే ఐఫోన్ 8కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట. ఈ స్మార్ట్ ఫోన్ను 22 శాతం పెద్దవాళ్లు కొనుగోలు చేస్తున్నారని రిపోర్టులో పేర్కొంది.

ఆపిల్ ఐఫోన్ అంటే యూత్ లో ఇప్పటికీ క్రేజ్ ఉందని సర్వే పేర్కొంది. 35శాతం మంది యువకులు ఈ సర్వేకు ప్రతిస్పందించారని తెలిపింది. ఐఫోన్ ఎక్స్ ను క్రిస్మస్ కానుకగా కోరకుంటున్నామన్నారు. వారిలో చాలా మంది ఐఫోన్ 8వైపు మొగ్గుచూపారు.

5జీ కోసం ఇండియాకి వల వేస్తున్న కంపెనీలు ఇవే..5జీ కోసం ఇండియాకి వల వేస్తున్న కంపెనీలు ఇవే..

దీంతో మొత్తం 70శాతం యువత ఆపిల్ స్మార్ట్ ఫోన్ల కోసం ఆప్షన్ గా చేసుకున్నారు. కుపెర్టినో దిగ్గజం యువకుల మధ్య బ్రాండ్ అప్పీల్ను నిలిపుకోగలింది. కేవలం 28శాతం మంది యువకులు మాత్రమే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8ను ఎంచుకున్నారు.

ఐఫోన్ ఎక్స్ గురించి ఇతర కోణంలో చూసినట్లయితే...ఐఫోన్ ఎక్స్ ను తయారు చేయాలంటే..దాదాపు 370 యుఎస్ డాలర్ల ఖర్చు అవుతుంది. ( రూ. 24,000) ప్రారంభ ధర 999యూఎస్ డాలర్లు( రూ. 65,000) ఆపిల్ ఐఫోన్ యొక్క 10వ వార్షికోత్సవ మోడల్లో హై గ్రాస్ మార్జిన్ సంపాదించుకుంటుంది.

ఐఫోన్ 4S ప్రారంభం నుంచి ఐఫోన్ యొక్క తయారీ వ్యయం ఎలా పెరిగిందో..స్టాటిస్టాచే ఒక చార్ట్ తెలుపుతుంది. ఐఫోన్ 10 మోడల్స్ లో కంటే రెండింతలు ఎక్కువ ఖరీదైంది. అయితే కేవలం ఇది ప్రాథమిక మోడల్స్ కోసం ధర సుమారు ఐదు రెట్లు పెరిగింది.

Best Mobiles in India

English summary
The teenagers though, opted for the Apple iPhone X as a Christmas gift.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X