Just In
- 33 min ago
Amazon App ఉందా..?అయితే ఈ రూ.20000 మీరే గెలుచుకోవచ్చు.
- 17 hrs ago
OPPO Reno5 Pro 5G: 2021 లో బెస్ట్ వీడియోగ్రఫీ స్మార్ట్‌ఫోన్ ఇదే !
- 20 hrs ago
Vivo స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుకు సరైన సమయం!! అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ..
- 22 hrs ago
Flipkart quiz: బిగ్ సేవింగ్ డేస్ సేల్ కోసం డిస్కౌంట్ వోచర్లను పొందే గొప్ప అవకాశం
Don't Miss
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Movies
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లక్ష రూపాయల స్మార్ట్‌ఫోన్‌కి రూ. 6 వేల స్మార్ట్‌ఫోన్ సవాల్
డిజిటల్ రివల్యూషన్ రోజు రోజుకు పతాక స్థాయికి చేరుకుంటోంది. దీన్ని దక్కించుకోవడానికి టాప్ కంపెనీలు పోటీలు పడుతున్నాయి.ఇందులో భాగంగానే కంపెనీలు టాప్ ఫీచర్లతో మొబైల్స్ ని మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ప్రతి ఏడాది ఓ కొత్త ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇక ప్రపంచంలో ఎక్కువ మంది ఏ స్మార్ట్‌ఫోన్ కొంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. తాజాగా కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ 2018కి సంబంధించి గ్లోబల్ టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్స్ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అమెరికా కంపెనీ ఆపిల్ కు చెందిన ఐఫోన్ ఎక్స్ మొబైల్ ప్రపంచంలోనే బెస్ట్ సెల్లింగ్ ఫోన్ గా నిలిచింది. అయితే ఆసక్తికరంగా చైనా దిగ్గజం షియోమి నుంచి వచ్చిన రెడ్‌మి 5ఎ స్మార్ట్ ఫోన్ ఆపిల్ ఫోన్ కి ధీటుగా తలపడుతోంది. ఏకంగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎస్9ని కూడా వెనక్కు నెట్టేసింది.
టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ల జాబితాలో ఆపిల్ ఎక్స్ టాప్‌లో ఉంది. తొలి నాలుగు స్థానాలు ఈ కంపెనీవే. వీటి తర్వాత ఐదో స్థానంలో రెడ్‌మి 5ఏ ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఇదే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ గా నిలిచింది. రెడ్‌మి 5ఏ ధర రూ.5,999గా ఉంటే,ఆపిల్ ఐఫోన్ ఎక్స్ ధర దాదాపు రూ.1 లక్ష వరకు ఉంది.

మొత్తం టాప్ టెన్ ఫోన్లు ఇవే..
తొలి స్థానంలో ఐఫోన్ ఎక్స్ ఉంది. దీని తర్వాతి స్థానంలో ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ 7 ఉన్నాయి. ఇక ఐదో స్థానంలో రెడ్‌మి 5ఏ ఉంది. ఆరో స్థానం శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఫోన్‌ది. ఏడో స్థానంలో మళ్లీ ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్ ఉంది. ఇక ఎనిమిదో స్థానంలో ఐఫోన్ ఎక్స్ఆర్, తొమ్మిదో స్థానంలో గెలాక్సీ ఎస్9 ప్లస్, పదో స్థానంలో శాంసంగ్ జే6 ఉన్నాయి.

ఐఫోన్ ఎక్స్ డిస్‌ప్లే
కొత్త ఐఫోన్ X లో బెజెల్ లెస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే ఉంది. 5.8 అంగుళాల డిస్‌ప్లేతో, 1125 x 2436 రిజొల్యూషన్‌తో, మొదటిసారిగా సూపర్ రెటీనాగా పిలువబడే ట్రూటోన్ ఓలెడ్ తెరను నిక్షిప్తంచేశారు. రెటీనా ఎల్‌సీడీ డిస్‌ప్లే ఏర్పాటుచేశారు. 3డీ టచ్ డిస్‌ప్లే ఫీచర్ ఏర్పాటుచేశారు. ముందు, వెనుక గ్లాస్ కవర్ ఉంది.

ఐఫోన్ ఎక్స్ డిజైన్
ఐఫోన్ ఎక్స్ ఆకారం 7నే పోలిఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకతల కారణంగా ముందు, వెనుక కొంత విభిన్నంగా ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో పైన ఫ్రంట్ కెమెరా, స్పీకర్, మైక్ ఉంటాయి. కింది భాగంలో హోమ్ బటన్ తీసేశారు. వెనుక భాగంలో యథావిధిగా కెమెరా, దాంతోపాటు ఫ్లాష్, మైక్ ఏర్పాటుచేశారు. ఐఫోన్ ఎక్స్ వెనుక భాగంలో రెండు కెమెరాలను ఒకదాని కింద ఒకటి ఏర్పాటు చేశారు.

ఐఫోన్ ఎక్స్ ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్
ఐఫోన్ X అధునాతన 6కోర్ ఆపిల్ ఏ11బయోనిక్ ప్రాసెసర్ ఏర్పాటుచేశారు. ఐఫోన్ ఎక్స్‌లో 3 జీబీ ర్యామ్ ఉండగా, 64, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో యూజర్లకు అందిస్తున్నారు.
ఐఫోన్ ఎక్స్ కెమెరాలు
ఐఫోన్ X వెనుక భాగంలో 12 మెగాపిక్సల్‌తో రెండు కెమెరాలు నిలువుగా ఏర్పాటుచేశారు. 4కే అల్ట్రాహెచ్‌డీ వీడియో రికార్డింగ్‌ను ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది. ఇక ముందు భాగంలో 7 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది.

ఐఫోన్ ఎక్స్ ఐవోఎస్ 11
ఐఫోన్ Xలో ఆపిల్ సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్-11 అందిస్తున్నది. ఇది ఆపిల్ గతేడాది జూన్ 5న జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో డెవలపర్‌ల కోసం విడుదలచేసింది. గతంలో వచ్చిన ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కన్నా అనేక భిన్నమైన ఫీచర్లను ఈ ఫోన్లో ఇచ్చారు. డివైస్ సాఫ్ట్‌వేర్‌లో ఐకాన్లు, థీమ్స్, యాప్‌లను కొత్తగా డిజైన్‌చేసి అందిస్తున్నారు.

ఐఫోన్ ఎక్స్ వాటర్-డస్ట్ నిరోధం
ఐఫోన్ 8, 8 ప్లస్ ఫోన్లలో ఐపీ 68 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. 1.5 మీటర్ల లోతులో సుమారు 30 నిమిషాలపాటు ఫోన్లను ఉంచినా వాటిలోకి నీరు చేరదు. వర్షం పడుతున్నా నిరభ్యంతరంగా ఫోన్లను వాడుకోవచ్చు.

ఐఫోన్ ఫింగర్‌ప్రింట్ ఐడీ
గత ఫోన్లలోని ఫింగర్‌ప్రింట్ ఐడీ స్థానంలో ఐఫోన్ Xలో నూతనంగా ఫేస్ ఐడీ ఫీచర్ ఏర్పాటుచేశారు. దీనివల్ల ఫ్రంట్ కెమెరా యూజర్ ముఖాన్ని స్కాన్ చేసి డివైస్‌ను లాక్, అన్‌లాక్ చేస్తుంది. అలాగే ఆపిల్ పే ద్వారా పేమెంట్లకు, యాప్ స్టోర్‌లో యాప్ కొనుగోళ్లకు, యాప్ లాక్, అన్‌లాక్‌కు కూడా ఫేస్ ఐడీ సపోర్ట్ చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను నైపుణ్యంగా, అత్యంత కచ్చితత్వంతో తయారుచేశారు. రాత్రి చీకట్లోనూ ఫేస్ ఐడీ పనిచేస్తుంది. అత్యంత పటిష్టమైన భద్రతావ్యవస్థను ఈ ఫేస్‌ఐడీలో నెలకొల్పారు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190