ఐఫోన్ ఎక్స్ అమ్మకాలు తగ్గుముఖం పట్టే అవకాశం

|

2017కు గాను మార్కెట్లో పెను సంచలనం రేపిన స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ ఎక్స్ (iPhone X) ఒకటి. ఐఫోన్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్పెషల్ డివైస్‌ను యపిల్ సంస్థ అందుబాటలోకి తీసుకువచ్చింది. ప్రస్తుతానికి ఈ ఫోన్ అమ్మకాలు బాగనే ఉన్నప్పటికి హాలీడే సీజీన్ ముగిసేసరికి అమ్మకాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 
ఐఫోన్ ఎక్స్ అమ్మకాలు తగ్గుముఖం పట్టే అవకాశం

డిజీటైమ్స్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఐఫోన్ ఎక్స్ అమ్మకాలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. 2017 4వ త్రైమాసికానికిగాను ఐఫోన్ ఎక్స్ అమ్మకాలు 35 మిలియన్ యనిట్లుగా ఉండొచ్చని భావిస్తున్నప్పటికి, 2018 మొదటి క్వార్టర్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవచ్చని సదురు రిపోర్ట్ పేర్కొంది. ఇప్పటికే అమెరికా, తైవాన్‌‌‌‌తో పాటు సింగపూర్ దేశాల్లో ఐఫోన్ ఎక్స్ అమ్మకాలు అంచనాలను అందుకోలేని స్థితిలో ఉన్నాయని తెలుస్తోంది.

2018లో తన అమ్మకాల సంఖ్యను మరింత పెంచుకునేందుకుగాను మూడు కొత్త ఐఫోన్‌లను యాపిల్ రంగంలోకి దింపబోతున్నట్లు డిజీటైమ్స్ రిపోర్ట్ పేర్కొంది. వీటిలో రెండు ఐఫోన్‌లు ఓఎల్ఈడి డిస్‌ప్లేలను కలిగి ఉంటే మరొక ఐఫోన్ మాత్రం ఎల్‌సీడీ స్ర్కీన్‌తో రాబోతోందట. ఇప్పటికే 5జీ ఫీచర్లతో కూడిన ప్రోటోటైప్ ఐఫోన్ పై యాపిల్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

వాట్సప్‌లో ఈ ఎమోజీ చాలా డేంజర్, అసభ్యకరమంటూ నోటీసులువాట్సప్‌లో ఈ ఎమోజీ చాలా డేంజర్, అసభ్యకరమంటూ నోటీసులు

యాపిల్ ఐఫోన్ ఎక్స్ (Apple iPhone X) స్పెసిఫికేషన్స్... 5.8 అంగుళాల సూపర్ రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, 3డీ టచ్ సిక్స్-కోర్ ఏ11 బయోనిక్ 64-బిట్ ప్రాసెసర్ విత్ 3 కోర్ జీపీయూ, ఎమ్11 మోషన్ కో-ప్రాసెసర్, స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
The report further says that Apple have already started working on a "prototype iPhone with support for pre-5G features".

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X