తక్కువ ధరకు అమెజాన్ లో ఐఫోన్ XR

|

ఐఫోన్ XR ప్రస్తుతం చాలా మందికి ఆపిల్ యొక్క ఉత్తమ ఐఫోన్‌గా పరిగణించబడుతుంది. ఐఫోన్ XS మరియు ఐఫోన్ XS మాక్స్ చాలా ఎక్కువ ధరతో ఉన్నందున ఇది గత సంవత్సరం చివరలో ప్రారంభించినప్పటి నుండి దీని ధర చాలా వరకు మారలేదు. మరోవైపు ఐఫోన్XR మరింత సరసమైనది. ఇది ఆన్‌లైన్‌లో ప్రారంభ ధర సాధారణంగా రూ.60,000 అయితే మీరు ఐఫోన్XRను ఇప్పుడు కేవలం 53,910రూపాయలకు పొందవచ్చు.

 
iphone xr price amazon india rs 53990 how to avail

ఐఫోన్ XR మొబైల్ అమెజాన్ ఇండియాలో రూ.59,900ల నుంచి లభిస్తుంది. అయితే కొంతమంది కస్టమర్లు 64 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ .53,910 కు కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డు మీద ఇఎంఐ ద్వారా లేదా క్రెడిట్ కార్డు మీద ఇఎంఐ మరియు నాన్-ఇఎంఐ ద్వారా 10 శాతం తక్షణ డిస్కౌంట్ ద్వారా పొందవచ్చు. అమెజాన్ ఇండియా ప్రకారం ఈ ఆఫర్ 2019 జూన్ 30 వరకు చెల్లుతుంది.

ఆఫర్ ధర:

ఆఫర్ ధర:

ఆపిల్ ఐఫోన్ XR ఆఫ్‌లైన్‌లో మరియు ఆపిల్ ఆథరైజ్డ్ స్టోర్స్‌లో ఇలాంటి ఆఫర్‌ను అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్‌ఆర్ యొక్క ప్రభావవంతమైన ధర 53,910 రూపాయలకు తగ్గడం, ఎక్కువ ప్రీమియం ఐఫోన్ ఎక్స్‌ఎస్ మరియు ఐఫోన్ ఎక్స్‌ఎస్ మాక్స్ వంటి మంచి ఫోన్‌కు ఇది చాలా గొప్ప విషయం.

ప్రారంభ ధర :

ప్రారంభ ధర :

ఐఫోన్ XR రిలీజ్ అయిన ప్రారంభంలో భారతదేశంలో దాని ధర రూ .76,900 నుంచి ప్రారంభించబడింది. ఐఫోన్ ఎక్స్‌ఆర్ గురించి ఇటీవల జరిపిన దీర్ఘకాలిక సమీక్షలో ఐఫోన్‌లో ఇంకా ఉత్తమమైన బ్యాటరీ జీవితాన్ని అందించడం కొనసాగిస్తున్నందున ఆరు నెలల తర్వాత కూడా ఫోన్ బాగానే ఉందని వాడిన అందరు చెబుతున్నారు.

స్పెసిఫికేషన్స్ :
 

స్పెసిఫికేషన్స్ :

ఐఫోన్ ఎక్స్‌ఆర్ సిరీస్ 7000 అల్యూమినియం ఫ్రేమ్‌ను ముందువైపు మరియు వెనుక భాగంలో గాజుతో నిర్మించబడి ఉంది. ఐఫోన్ XS మరియు XS మాక్స్‌లోని AMOLED ప్యానెల్స్‌లా కాకుండా ఐఫోన్ XR 6.1-అంగుళాల HD (1792x828) LCD ని అందిస్తుంది అయితే ఇది చాలా బాగుంది. ఇది మృదువైన మరియు ఆప్టిమైజ్ చేసిన iOS 12 సాఫ్ట్‌వేర్‌తో జత చేయబడి ఉంటుంది. మరియు ఫాస్ట్ A12 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 12-మెగాపిక్సెల్ f/ 1.8 సెన్సార్ కెమెరాతో పగటిపూట సహజ మరియు వివరణాత్మక ఫోటోషాట్‌లను తీయగలదు.అయితే ఐఫోన్ ఎక్స్‌ఆర్ తక్కువ-కాంతిలో ఫోటోగ్రఫీ కోసం నైట్ మోడ్‌లను అందించే కొత్త ఫ్లాగ్‌షిప్‌ల ఫోన్‌లతో పోటీ పడడంలో విఫలమైంది.

Best Mobiles in India

English summary
iphone xr price amazon india rs 53990 how to avail

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X