Jio, Airtel సమ్మర్ ప్లాన్లకు పోటీగా బిఎస్ఎన్ఎల్ రోజుకు 3జిబి డేటా ప్లాన్

సమ్మర్ లో కూల్ కూల్ గా ఐపీఎల్ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో టెలికాం దిగ్గజాలు కూడా యూజర్లకు కూల్ ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి.

|

సమ్మర్ లో కూల్ కూల్ గా ఐపీఎల్ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో టెలికాం దిగ్గజాలు కూడా యూజర్లకు కూల్ ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. యూజర్లకు ఐపీఎల్ అనుభూతిని అందించేందుకు సరికొత్త ప్లాన్లలో అధిక డేటాను ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటికే జియో, ఎయిర్ టెల్ ఆ బాటలో నడవగా ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కూడా చేరింది. స్పెషల్‌ ఐపీఎల్‌ ప్లాన్‌గా 258 రూపాయలతో ఓ సరికొత్త ప్యాక్‌ను ఆవిష్కరించింది. 51 రోజుల వాలిడిటీతో ఈ ప్యాక్‌పై 153 జీబీ డేటా ఆఫర్‌ చేయనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ పేర్కొంది. తమ ప్రీపెయిడ్‌ మొబైల్‌ కస్టమర్లకు ఎస్‌టీవీ రూ.258పై 51 రోజుల వాలిడిటీతో అపరిమిత డేటా, రోజుకు 3జీబీ డేటాను అందించనున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రకటించింది. తక్కువ రేటుకు లైవ్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లను స్ట్రీమ్‌ చేసుకునేందుకు తమ సబ్‌స్క్రైబర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.

 
Bsnl

కాగా క్రికెట్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని జియో రూ.251కే ఓ నూతన ప్లాన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. రూ. 251 ప్లాన్ రీఛార్జ్ ద్వారా యూజర్లు 102 జీబీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ కింద అనేక రకాలైన ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. ఈ ప్లాన్‌ను జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌గా వ్యవహరిస్తుండగా, ఐపీఎల్ జరిగే 51 రోజుల పాటు అన్ని మ్యాచ్‌లను ఉచితంగా చూసేందుకు జియో వీలు కల్పించింది. ఏప్రిల్ 7వ తేదీన ఐపీఎల్ ప్రారంభం కానుండగా ఆ తేదీ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు అన్ని మ్యాచ్‌లను జియో కస్టమర్లు ఉచితంగా చూడాలంటే రూ.251 ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాలి. అనంతరం మై జియో యాప్‌లో క్రికెట్ లైవ్ ప్రసారాలను వీక్షించవచ్చు.

 

యూజర్లకి అదిరిపోయే శుభవార్తను అందించిన ఎయిర్‌టెల్యూజర్లకి అదిరిపోయే శుభవార్తను అందించిన ఎయిర్‌టెల్

రియలన్స్ జియోకి పోటీగా ఎయిర్‌టెల్ కూడా క్రికెట్ అభిమానుల కోసం అదిరిపోయే శుభవార్తను అందించింది. ఐపీఎల్ చూడాలనుకునే వారికి అద్బుత అవకాశాన్ని అందిస్తోంది. త‌న ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు ఉచితంగా లైవ్ ప్రసారాలు చూసే సౌకర్యాన్ని భారతి ఎయిర్‌టెల్ కల్పిస్తోంది. ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను క‌స్ట‌మ‌ర్లు ఫోన్ల‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే దాంట్లో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను లైవ్‌లో ఉచితంగా వీక్షించ‌వ‌చ్చ‌ని ఎయిర్‌టెల్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఎయిర్‌టెల్ టీవీ యాప్ ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైస్‌ల‌కు అందుబాటులో ఉంది.

ఐపీఎల్ సంద‌ర్భంగా ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో ప్ర‌త్యేకంగా క్రికెట్ కోసం ఓ సెక్ష‌న్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్‌టెల్ వినియోగ‌దారులు లైవ్ యాక్ష‌న్‌ను అస్స‌లు మిస్ అయ్యే అవ‌కాశం ఉండ‌దు. అలాగే వినియోగ‌దారులు త‌మ‌కు న‌చ్చిన ఐపీఎల్ టీంల‌ను ఫాలో అవుతూ ఆ టీం మ్యాచ్‌ల‌ను మిస్ కాకుండా చూడ‌వ‌చ్చు. అందుకు గాను నోటిఫికేష‌న్లు వ‌చ్చేలా ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను తీర్చిదిద్దారు. అలాగే లైవ్‌లో జ‌రిగే మ్యాచ్‌ల వివ‌రాల‌ను నోటిఫికేష‌న్ల రూపంలో పంప‌నున్నారు. ఈ ఫీచ‌ర్లు కావాలనుకుంటే ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్లు త‌మ ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ను కొత్త వెర్ష‌న్‌కు అప్‌డేట్ చేసుకోవాలి.

Best Mobiles in India

English summary
IPL 2018: BSNL announces a special IPL plan offering 153 GB data with 51 days validity at Rs 258 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X