Home
News

ఐపీఎల్ 2019 సంధర్భంగా బెస్ట్ డేటా పాన్లు మీకోసం

భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అందరికీ నిన్నటి నుంచే అసలు పండగ మొదలయ్యింది.ఎందుకంటే వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచులు అట్టహాసంగా మొదలయ్యాయి. ఐపీఎల్ లీగ్ ఇప్పుడు క్రికెట్

భారతదేశంలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అందరికీ నిన్నటి నుంచే అసలు పండగ మొదలయ్యింది.ఎందుకంటే వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచులు అట్టహాసంగా మొదలయ్యాయి. ఐపీఎల్ లీగ్ ఇప్పుడు క్రికెట్ ప్రేమికులని తెగ ఉత్సాహపరుస్తోంది. వారి ఉత్సాహాన్ని క్యాష్ చేసుకునేందుకు పలు టెలికం సంస్థలు స్పెషల్ ఆఫర్స్ ప్రకటిస్తూ వినియోగదారులకు చేరువ కావాలని చూస్తున్నాయి.

ఐపీఎల్ 2019 సంధర్భంగా బెస్ట్ డేటా పాన్లు మీకోసం

ఇందులో భాగంగానే టెలికాం దిగ్గజాలన్నీ ఐపీఎల్ టీ -20 సందర్భంగా స్పెషల్ ఆఫర్స్‌ని ప్రకటించాయి. వీటిల్లో బెస్ట్ ఆఫర్లను ఓ సారి పరిశీలిద్దాం.

బిఎస్ఎన్ఎల్ రూ. 499, రూ.199 ప్యాక్

బిఎస్ఎన్ఎల్ రూ. 499, రూ.199 ప్యాక్

ఎస్టీవీ-499 రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు 90 రోజుల కాలపరిమితితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ), రోజూ 1జీబీ డేటా, క్రికెట్ ఎస్‌ఎంస్ అలర్ట్స్, ఫ్రీ అన్‌లిమిటెడ్ సాంగ్ ఛేంజ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు. పూర్తి వివరాలకు 1503 లేదా 18001801503 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.
ఎస్టీవీ-199ను రీచార్జ్ చేసుకున్న వారికి.. 28 రోజుల కాలపరిమితితో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్, ఎస్టీడీ), రోజూ 1 జీబీ డేటా, క్రికెట్ ఎస్‌ఎంస్ అలర్ట్స్, ఫ్రీ అన్‌లిమిటెడ్ సాంగ్ ఛేంజ్‌ను పొందవచ్చు.

జియో రూ.197, రూ.299 ప్యాక్

జియో రూ.197, రూ.299 ప్యాక్

జియో కూడా రూ.197తో ఐపీఎల్ ప్లాన్‌‌ను ప్రవేశపెట్టింది. 28 రోజుల కాలపరిమితి ఉన్న ఈ ప్లాన్ ద్వారా రోజుకు 2 బీజీ డేటాను అందించనుంది. దీనిద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఫ్రీ రోమింగ్, ఉచిత ఎస్‌ఎంఎస్‌లను అందిస్తున్నారు. హాట్‌స్టార్‌ను కూడా ఉచింతంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇక రూ.299తో రిచార్జ్ చేసుకున్నవారికి 28 రోజుల కాలపరిమితితో రోజుకు 3 జీబీ డేటాను జియో అందిస్తోంది. ఇందులో హాట్ స్టార్ యాక్సెస్ ఫ్రీగా వస్తుంది. అన్ లిమిటెడ్ లోకల్, నేషనల్ కాల్స్ ఉచితం.

ఎయిర్ టెల్ రూ.249, రూ.448 ప్యాక్

ఎయిర్ టెల్ రూ.249, రూ.448 ప్యాక్

రూ.249 ప్లానులో 28 రోజుల కాలపరిమితితో రోజుకు 2 జీబీ డేటా అందిస్తున్నారు. అలాగే 82 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటా ఇస్తున్నారు. ఈ రెండు ప్లాన్లలోనూ అన్‌లిమిటెడ్ కాల్స్, 100 మెసేజ్‌లు, ఎయిర్‌టెల్ టీవీ యాక్సెస్ అందిస్తున్నారు.
రూ.448 ప్యాక్ ద్వారారోజుకు 1.5జిబి , ఎయిర్ టెల్ టివి 82 రోజులు పాటు, 100 ఎస్మెమ్మెస్ లు, ఉచిత కాల్స్ లభిస్తాయి.

వొడాఫోన్-ఐడియా ఐపీఎల్ రూ.511 ప్యాక్

వొడాఫోన్-ఐడియా ఐపీఎల్ రూ.511 ప్యాక్

వొడాఫోన్ కూడా 84 రోజుల కాలపరిమితితో రూ.511 ప్లానులో రోజుకు 2 జీబీ డేటాను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఈ ప్లాన్ ద్వారా పొందుతారు. లైవ్ టీవీ యాక్సెస్‌ను కూడా వొడాఫోన్ అందిస్తోంది.

Best Mobiles in India

English summary
IPL 2019 Data Plans: Best IPL Data Packs From Jio, Airtel, BSNL, Vodafone & Idea
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X