Home
News

IPL 2024 జియో, ఎయిర్‌టెల్‌, Vi ప్రత్యేక ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌లు.. ధర, వ్యాలిడిటీ, డేటా వివరాలు..

ఐపీఎల్‌ 2024 (IPL 2024) షెడ్యూల్‌ విడుదల అయింది. మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 17 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. క్రికెట్‌ లవర్స్‌ అంతా ఈ మ్యాచ్‌ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే జియో సినిమా యాప్‌ ద్వారా 4K రిజల్యూషన్‌ వరకు ఉచితంగా చూడవచ్చు. ఈ సందర్భంగా జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ -ఐడియా సంస్థలు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను విడుదల చేశారు.

ఎయిర్‌టెల్‌ ఐపీఎల్‌ రీఛార్ట్‌ ప్లాన్‌..
ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ రూ.699 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వ్యాలిడిటీని (IPL 2024 Airtel Recharge Plans) కలిగి ఉంటుంది. రోజుకు 3GB చొప్పున 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు ప్రైమ్‌ వీడియో సబ్‌స్క్రిప్షన్‌ ను కూడా పొందవచ్చు. మరియు 5G నెట్‌ వర్క్‌ను సపోర్టు చేసే స్మార్ట్‌ ఫోన్లలో అన్‌లిమిడెట్ 5G డేటాను కూడా పొందవచ్చు.

IPL 2024 Jio airtel and Vi offers special recharge plans

జియో ఐపీఎల్‌ ప్లాన్‌లు..
జియో వినియోగదారులు రూ.444 తో రీఛార్జ్‌ చేసుకుంటే 60 రోజుల వ్యాలిడిటీతో 100 GB డేటాను పొందవచ్చు. అదే రూ.667 ప్లాన్‌ తో 90 రోజుల పాటు 150GB ని పొందవచ్చు. దీంతోపాటు ఫెస్టివ్‌ ఆఫర్‌లో భాగంగా రూ.999 ప్లాన్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 3GB చొప్పున 4G డేటాను పొందవచ్చు.

అదనంగా 6GB డేటా : దీంతోపాటు జియో నెలవారీ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్లు (IPL 2024 Jio Recharge Plans) కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.399 రీఛార్జ్‌ ప్లాన్ ద్వారా రోజుకు 3GB చొప్పున 4G హైస్పీడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అదనంగా 6GB డేటాను పొందవచ్చు.

ఐపీఎల్‌ కోసం వోడాఫోన్- ఐడియా రీఛార్జ్‌ ప్లాన్‌లు..
వోడాఫోన్- ఐడియా (Vi) రూ.699 ప్లాన్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకుంటే 56 రోజుల వ్యాలిడిటీతో 3GB డేటాను (IPL 2024 Vi Recharge Plans) పొందవచ్చు. దీంతో పాటు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌ లిమిటెడ్‌ 4G డేటాను పొందవచ్చు. మరియు Vi మూవీస్‌, TV సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

అధికంగా డేటాను వినియోగించుకొనే యూజర్ల కోసం రూ.475 ప్లాన్‌ను వోడాఫోన్ - ఐడియా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా 28 రోజులపాటు 4GB చొప్పున డేటాను పొందవచ్చు. రూ.418 రీఛార్జీ ప్లాన్‌ తో 56 రోజుల వ్యాలిడిటీతో 100GB డేటాను పొందవచ్చు. డేటా వోచర్లను కూడా అందుబాటులో ఉంచింది. రూ.25 వోచర్‌తో రూ.1.5GB డేటాను పొందవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
IPL 2024 Jio airtel and Vi offers special recharge plans here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X