Home
News

IPL 2025 క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా..!

క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న IPL 2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే అభిమానులు ఈ మ్యాచ్‌ల కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) సంస్థలు IPL ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రికెట్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు వీలుగా జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ (Jiohotstar) తో ప్రత్యేక ప్లాన్‌లను తీసుకొచ్చాయి.

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel IPL 2025 Recharge Plans) ఐపీఎల్‌ సీజన్‌ కోసం రెండు క్రికెట్‌ ప్యాక్స్‌ను లాంచ్‌ చేసింది. రూ.100, రూ.195 యాడ్‌ ఆన్‌ డేటా ప్లాన్స్‌లో భాగంగా డేటాతోపాటు జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను అందిస్తోంది. ఈ రెండు ప్లాన్‌లలో ఎటువంటి కాలింగ్‌, డేటా ప్రయోజనాలను అందించడం లేదు.

IPL 2025 Airtel and Vodafone idea launched special recharge plans

* ఎయిర్‌టెల్‌ యూజర్లు రూ.100 రీఛార్జ్ చేయించుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో 5GB డేటాను పొందుతారు. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ /TV సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. క్రికెట్‌తోపాటు మూవీస్‌, షోలు సహా డాక్యుమెంటరీలను వీక్షించవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.195 రీఛార్జ్‌ ప్లాన్‌ (Airtel Rs195 Recharge Plan) లో భాగంగా 15GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంటుంది. దీంతోపాటు ఈ ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఈ రెండు రీఛార్జ్‌ ప్లాన్లు ఎంచుకొనే యూజర్లు కచ్చితంగా యాక్టివ్‌ ప్లాన్‌లను కలిగి ఉండాలని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

IPL 2025 Airtel and Vodafone idea launched special recharge plans

* మరో ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్‌ ఐడియా (Vodafone Idea IPL 2025 Recharge Plans) కూడా ఐపీఎల్‌ సీజన్‌ కోసం జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌, డేటాతో ప్లాన్‌లను లాంచ్‌ చేసింది. రూ.101, రూ.239, రూ.399 ప్లాన్‌లను తీసుకొచ్చింది. రూ.101 ప్లాన్‌లో 5GB డేటాను పొందవచ్చు. ఈ డేటా వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. 90 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు

వోడాఫోన్‌ ఐడియా రూ.239 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా 300 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌‌స్క్రిప్షన్‌ ను కూడా పొందవచ్చు. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులుగా ఉంటుంది.

IPL 2025 Airtel and Vodafone idea launched special recharge plans

వోడాఫోన్‌ ఐడియా రూ.399 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజువారీ 100 SMSలను వినియోగించుకోవచ్చు. మరియు ప్రతి రోజు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజులో 12 గంటల పాటు అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు.

Take a Poll

మరియు వీకెండ్‌ డేటా రోల్‌ ఓవర్‌ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది. రేపటి నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కొత్త ప్లాన్‌లను యూజర్లకు ఉపయోగపడే అవకాశం ఉంది.

దీంతోపాటు ఇప్పటికే ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌ ఐడియా సంస్థలు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లను విడుదల చేశాయి. ఆయా ప్లాన్‌లకు ఈ తాజా రీఛార్జ్‌ ప్లాన్‌లను అదనంగా అందుబాటులోకి వచ్చాయి. జియో ఇప్పటికే రూ.299 కంటే ఎక్కువ రీఛార్జ్ ప్లాన్‌లపై 90 రోజుల వ్యాలిడిటితో జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ ను అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
IPL 2025 Airtel and Vodafone idea launched special recharge plans with jiohotstar subscription
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X