వాట్సప్ నుంచి సరికొత్త స్టిక్కర్లు
క్రికెట్ ఫ్యాన్స్‌కు వాట్సప్ గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సప్‌లో కొత్తగా ఐపీఎల్ స్టిక్కర్స్ అందుబాటులోకి వచ్చాయి. IPL 2019 టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో వాట్సప్ కాస్త ఆలస్యంగా ఐపీఎల్ స్టిక్కర్స్‌ని యూజర్
క్రికెట్ ఫ్యాన్స్‌కు వాట్సప్ గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సప్‌లో కొత్తగా ఐపీఎల్ స్టిక్కర్స్ అందుబాటులోకి వచ్చాయి. IPL 2019 టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో వాట్సప్ కాస్త ఆలస్యంగా ఐపీఎల్ స్టిక్కర్స్‌ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఐపీఎల్ స్టిక్కర్లు లభిస్తున్నాయి.

ఐఫోన్ యూజర్లకు త్వరలో ఐపీఎల్ స్టిక్కర్స్ అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ స్టిక్కర్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా అప్ డేట్ చేసుకోవాలి అనే అంశాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

వాట్సప్ అప్‌డేట్
మీరు వాట్సప్‌లో క్రికెట్ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీ వాట్సప్‌ని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి, వాట్సప్ మెసెంజర్ ఓపెన్ చేసి అప్‌డేట్ చేయాలి.

2.19.115 ఇన్‌స్టాల్
మీకు అప్‌డేట్ వర్షన్ 2.19.115 ఇన్‌స్టాల్ అయితే అప్పడు క్రికెట్ స్టిక్కర్స్ వాడుకోవచ్చు. మరి వీటిని ఎలా పంపుకోవాలో ఓసారి తెలుసుకుందాం.

ఛాట్ విండోలో
ముందుగా మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఏదైనా ఛాట్ ఓపెన్ చేసి, ఛాట్ విండోలో క్లిక్ చేయండి.అక్క కనిపించే స్మైల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే డౌన్‌లో స్టిక్కర్ ఎమోజి, గిఫ్, స్టిక్కర్ ఐకాన్స్ కనిపిస్తాయి.

సింబల్ పైన
అక్కడ మీకు కనిపించే స్టిక్కర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.అప్పటికే డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్స్ లిస్ట్ పక్కన కనిపించే + సింబల్ పైన క్లిక్ చేయండి. ALL STICKERS సెక్షన్‌లో మీకు క్రికెట్ స్టిక్కర్స్ కనిపిస్తాయి. క్రికెట్ స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఆ స్టిక్కర్స్ ఎవరికైనా పంపొచ్చు

గతేడాది అక్టోబర్‌లో
కాగా వాట్సప్‌లో స్టిక్కర్ ఫీచర్ గతేడాది అక్టోబర్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎమోషన్స్‌ని టెక్స్ట్ రూపంలో కాకుండా స్టిక్కర్లలో పంపేందుకు ఇప్పుడు యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు
ఇదిలా ఉంటే వాట్సప్ పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు కొత్త కొత్త స్టిక్కర్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్లేస్టోర్‌లో థర్డ్ పార్టీ యాప్స్ స్టిక్కర్లు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ఇప్పుటు వాట్సప్ స్వయంగా క్రికెట్ స్టిక్కర్స్ అందుబాటులోకి తీసుకురావడం విశేషంగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications








