ఐపీఎల్ 2018 కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్
రిలయన్స్ జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌కు పోటీగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఐపీఎల్ ప్యాక్ అనౌన్స్ చేసింది. 51 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్యాక్ ధరను రూ.258గా బీఎస్ఎన్ఎల్ ఫిక్స్ చేసింది.
రిలయన్స్ జియో క్రికెట్ సీజన్ ప్యాక్‌కు పోటీగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఐపీఎల్ ప్యాక్ అనౌన్స్ చేసింది. 51 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్యాక్ ధరను రూ.258గా బీఎస్ఎన్ఎల్ ఫిక్స్ చేసింది. ప్యాక్ మొత్తం మీద 153జీబి డేటా యూజర్‌కు అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు ముగిసేంత వరకు రోజుకు 3జబి డేటా చొప్పున యూజర్‌కు లభిస్తుంది. ఐపీఎల్ 2018ని పురస్కరించుకుని DATA STV-248 పేరుతో ఈ ఐపీఎల్ అన్‌లిమిటెడ్ ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ప్రీపెయిడ్ మొబైల్ కస్టమర్స్‌కు మాత్రమే వర్తించే ఈ ప్యాక్‌లో భాగంగా రోజుకు 3జీబి అన్‌లిమిటెడ్ మొబైల్ డేటా అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ ఫీవర్ ముగిసేంత వరకు ఈ డేటా లభిస్తూనే ఉంటుంది. 2018, ఏప్రిల్ 7వ తేదీన లాంచ్ అయిన ఈ ఆఫర్ 30 ఏప్రిల్, 2018 వరకు అందుబాటులో ఉంటుంది.

ప్రీ-5జీ హైస్పీడ్ ఇంటర్నెట్‌ను లాంచ్ చేసిన జియో..
ఇదిలా ఉండగా ఐపీఎల్ 2018ని పురస్కరించుకుని ముంబై వాంకేడ్ అలానే ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానాల్లో ప్రీ-5జీ హై స్పీడ్ ఇంటర్నెట్ సుదుపాయాన్ని కల్పించనున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. 4జీ అడ్వాన్సుడ్ మాసివ్ ఎంఐఎమ్ఓ (మల్టిపుల్-ఇన్‌పుట్, మల్టిపుల్ - అవుట్‌పుట్)గా పిలవబడుతోన్న ఈ హైస్పీడ్ ఇంటర్నెట్, హై డెన్సిటీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే 30MHz వైడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కంటే 5 రెట్లు వేగవంతమైన నెట్‌వర్క్ స్పీడ్‌ను ఆఫర్ చేస్తుంది.
వైడ్-రేంజింగ్ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేసేందుకుగాను..
జియో విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ ప్రకారం ముంబైలోని వాంకేడ్ అలానే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానాల్లో వైడ్-రేంజింగ్ నెట్‌వర్క్‌ను క్రియేట్ చేసేందుకుగాను మాసివ్ మల్టిపుల్ - ఇన్‌పుట్, మల్టిపుల్ - అవుట్‌పుట్ కెపాసిటర్స్‌తో పాటు 4జీ eNodeBs అలానే వై-ఫై సెల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
దుుమ్మురేపుతోన్న జియో ఐపీఎల్ ఆఫర్...
ఐపీఎల్ 2018ని పురస్కరించుకుని జియో ఓ సంచలన ఆఫర్ ను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. జియో క్రికెట్ సీజన్ ప్యాక్ పేరుతో లభ్యమవుతోన్న ఈ ఆఫర్ లో భాగంగా జియో యూజర్లు రూ.251 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 51 రోజుల పాటు అన్ని ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా వీక్షించే వీలుంటుంది.


Click it and Unblock the Notifications