iQOO 10, 10 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్ వచ్చేసింది!! ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి...

|

గేమింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO త్వరలో లాంచ్ చేయనున్న కొత్త iQoo 10 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లలో iQOO 10 మరియు 10 ప్రోలను జూలై 19న చైనాలో ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. తరువాత గ్లోబల్ మార్కెట్‌లో కూడా విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఈ సిరీస్‌లో iQOO 10 మరియు 10 ప్రో రెండు మోడల్‌లతో పాటుగా iQoo 10 లెజెండ్ BMW ఎడిషన్ కూడా ఉండవచ్చు అని భావిస్తున్నారు. iQoo బ్రాండ్ షేర్ చేసిన వీడియో క్లిప్ ప్రకారం ఈ రెండు ఫోన్లు డ్యూయల్-టోన్ డిజైన్ మరియు వెనుక భాగంలో కెమెరా ఐలాండ్‌తో వస్తున్నట్లు చూపుతున్నది. అలాగే ఈ iQoo 10 సిరీస్ ఫోన్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెసర్‌తో వస్తుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. వీటికి సంబంధించిన మరిన్ని లీక్ ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Weibo

చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Weiboలో iQoo సంస్థ ఒక చిన్న టీజర్ ని పోస్ట్ చేసింది. iQoo 10 సిరీస్ చైనాలో జూలై 19న స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు (సాయంత్రం 5 గంటలకు IST) జరగనున్న కార్యక్రమంలో ప్రారంభించబడుతుందని ప్రకటించింది. ఈ ఫోన్ 10వ తరం ఫ్లాష్ ఛార్జింగ్ తో వస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ లైనప్‌లో iQoo 10 మరియు iQoo 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయని సూచిస్తున్నాయి.

iQOO

iQOO కంపెనీ విడుదల చేసిన టీజర్ వీడియోలో ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఫోన్‌లో కొంత భాగం కార్బన్ ఫైబర్ లాంటి మెటీరియల్‌తో వస్తుందని మరియు ఇతర భాగం లెదర్ ఫినిషింగ్‌తో ఉంటుందని ఇది సూచిస్తుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో ఎత్తైన కెమెరా ద్వీపాన్ని కలిగి ఉంటుందని చూపుతున్నది. దానిపై "ఫేసినేషన్ మీట్స్ ఇన్నోవేషన్"తో రావాలని సూచించబడింది. టీజర్ లో చూపిన స్మార్ట్‌ఫోన్ iQoo 10 Pro గా ఉంటుందని కంపెనీ ధృవీకరించింది.

iQoo 10 Pro స్పెసిఫికేషన్‌లు (అంచనా)
 

iQoo 10 Pro స్పెసిఫికేషన్‌లు (అంచనా)

iQOO 10 ప్రో స్మార్ట్‌ఫోన్ కు సంబందించిన స్పెసిఫికేషన్ వివరాలు ఇటీవలే TENAA సర్టిఫికేషన్‌లో ధృవీకరించబడింది. ముఖ్యంగా ప్రో వెర్షన్ 2K LTPO డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్, 200W వైర్డ్ ఛార్జింగ్ మరియు 65W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ప్రో మోడల్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది QHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే iQOO 10 ప్రో మోడల్ ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఆరిజిన్OS తో రన్ అవుతూ బాక్స్ వెలుపల బూట్ చేయబడి వస్తుంది. చివరగా ఇది 200W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,550mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి రావచ్చు అని భావిస్తున్నారు.

iQOO 10 ప్రో

iQOO 10 ప్రో మోడల్ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 16GB వరకు LPDDR5 RAM మరియు 512GB వరకు UFS 3.1 స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ పరంగా ఫోన్ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 14.6MP టెలిఫోటో కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఏ స్మార్ట్‌ఫోన్‌ ముందుగా రానున్నట్లు కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.

iQOO 10 లెజెండ్

iQOO 10 లెజెండ్ BMW ఎడిషన్‌తో పాటు iQOO 9T ఫోన్ మోడల్ నంబర్ I2201తో భారతీయ BIS సర్టిఫికేషన్‌లో గుర్తించబడింది. ఇది కూడా వచ్చే నెలలో లాంచ్ కానున్నది. ఇది తాజా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ద్వారా ఆధారపడి రన్ అవుతూ అందించబడుతుందని భావిస్తున్నారు. అన్‌వర్స్డ్ కోసం ఇది 4nm నోడ్ ఆధారంగా ఆక్టా-కోర్ SoC. ఇది 2GHz వద్ద క్లాక్ చేయబడిన నాలుగు కార్టెక్స్-A510 కోర్లను కలిగి ఉంది. ఇందులో మూడు కార్టెక్స్-A710 కోర్లు 2.75GHz వద్ద క్లాక్ చేయబడి ఉంటే చివరిది కోర్టెక్స్-X2 కోర్ 3.2GHz వద్ద క్లాక్ చేయబడింది. ఇది 8GB/128GB మరియు 12GB/256GB వంటి రెండు RAM మరియు స్టోరేజ్ వేరియంట్‌లతో లభించే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
iQOO 10, iQOO 10 Pro Smartphones Launch Date Confirmed on July 19: Specifications, Features Leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X