iQoo 12 ఫోన్ల లాంచ్ తేదీ లీక్ అయింది! లీక్ అయిన స్పెసిఫికేషన్లు
iQoo 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అతి త్వరలో జరగవచ్చు అని లీక్ అయిన సమాచారం తెలియచేస్తోంది. సంస్థ ఇంకా ఖచ్చితమైన తేదీని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు, అయితే తాజా లీక్ ప్రకారం iQoo 12 మరియు iQoo 12 ప్రో నవంబర్ 7న అధికారికంగా అందుబాటులోకి వస్తాయి అని లీక్ వివరాలు తెలియచేస్తున్నాయి. iQoo 11 సిరీస్ కు కొనసాగింపుగా వస్తున్న ఈ ఫోన్లు మూడు విభిన్న షేడ్స్‌లో వస్తాయని చెప్పబడింది.
iQoo 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,880mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. iQoo 12 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC ద్వారా అందించబడుతుందని భావిస్తున్నారు. ఇది 24 GB వరకు LPDDR5x RAM మరియు 1TB వరకు UFS 4.0 స్టోరేజీని అందిస్తున్నది అంచనాలున్నాయి.

ప్రముఖ చైనా సోషల్ మీడియా Weibo లో టిప్‌స్టర్ పాండా ఈజ్ బాల్డ్ (చైనీస్ నుండి అనువదించబడింది) iQoo 12 మరియు iQoo 12 Pro నవంబర్ 7న చైనాలో లాంచ్ అవుతాయని పేర్కొన్నారు. అవి నలుపు, ఎరుపు మరియు తెలుపు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటాయని చెప్పబడింది.
మరొక టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (చైనీస్ నుండి అనువదించబడింది) iQoo 12 లైనప్ యొక్క స్మార్ట్ ఫోన్ల యొక్క బ్యాటరీ మరియు ఛార్జింగ్ వివరాలను హ్యాండ్‌సెట్‌ల UFCS జాబితాను ఉటంకిస్తూ సూచించింది. లీక్ అయిన వివరాల ప్రకారం, సాధారణ iQoo 12 స్మార్ట్ ఫోన్ 4,880mAh డ్యూయల్-సెల్ బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మరోవైపు, iQoo 12 ప్రో, 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 4,980mAh బ్యాటరీని అందించగలదు.
గత లీక్‌ల ప్రకారం, iQoo 12 సిరీస్ ఇంకా విడుదల చేయని స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 SoC తో లాంచ్ కావొచ్చని అంచనాలున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ గరిష్టంగా 24GB RAM మరియు 1TB స్టోరేజీని ఆఫర్ చేస్తుందని చెప్పబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14తో పనిచేస్తుంది. మరియు ఇది 2K రిజల్యూషన్ మరియు 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో శాంసంగ్ E7 అమోలెడ్ డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. అవి మెటల్ బాడీలతో కూడా వస్తాయన్నారు.
iQoo 12 సిరీస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV50H సెన్సార్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు మరొక 50-మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL JN1 సెన్సార్‌తో అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. 3x జూమ్ మరియు OIS మద్దతుతో 64- మెగాపిక్సెల్ OV64B టెలిఫోటో సెన్సార్ ఉంది.
దీని ముందు మోడల్ iQOO 11 ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 SoC ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ భారతదేశంలో ఈ ప్రాసెసర్ తో పనిచేసే మొదటి ఫోన్ అవుతుంది.ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన కెమెరాలో 50MP సెన్సార్ ఉంది. ఇది 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








