Home
News

iQOO నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ట్రిపుల్‌ కెమెరా, 1TB స్టోరేజీ, 120W సూపర్‌ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌..

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ iQOO నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. IQOO 11 తర్వాత తరం స్మార్ట్‌ఫోన్‌ IQOO 12 స్మార్ట్‌ఫోన్ డిసెంబర్‌ 12న భారత్‌లో విడుదల కానుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉండి భారత్‌లో విడుదల అవుతున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే చైనాలో విడుదల అయింది.

IQOO 12 డిస్‌ప్లే: ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌ తన హైయర్‌ ఎండ్‌ వేరియంట్‌ ఐకూ 12 ప్రో ఫోన్‌కు చాలా అంశాల్లో పోలిక ఉంటుంది. ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1260*2800 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ స్క్రీన్‌ 144Hz రీప్రెష్‌ రేట్‌తో రానుంది. మరియు మెరుగైన నాణ్యత కోసం HDR10+ ను సపోర్టు చేస్తుంది.

iQOO 12 smartphone

IQOO 12 స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలు : ఈ ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా, 100X జూమ్‌ సామర్థ్యం కలిగిన 64MP టెలిఫోటో లెన్స్‌, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియోల కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది.

120W సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ : ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజీని 1TB వరకు పెంచుకొనే అవకాశం ఉంది. ఐకూ 12 ప్రో మాదిరిగా ఐకూ 12 స్మార్ట్‌ఫోన్‌ ఒకేరకమైన కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్‌ సెన్సార్‌, మరియు ఫేస్‌లాక్ ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 120W సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5000 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

iQOO 12 smartphone

IQOO 12 స్మార్ట్‌ఫోన్ ధర.. ! : ఈ IQOO 12 స్మార్ట్‌ఫోన్ చైనాలో ఇప్పటికే విడుదల అయింది. ఈ ఫోన్‌ వేర్వేరు ర్యామ్‌, అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో చైనాలో అందుబాటులోకి వచ్చింది. 12GB ర్యామ్‌, 256GB స్టోరేజీ వేరియంట్ ధర భారత కరెన్సీ ప్రకారం రూ.45 వేలుగా ఉంది.

IQOO 12 స్మార్ట్‌ ఫోన్‌ 16 GB ర్యామ్‌, 512 GB స్టోరీజీ వేరియంట్ ధర రూ.50 వేలుగా ఉంది. మరియు 16 GB ర్యామ్‌, 1 TB స్టోరేజీ వేరియంట్‌ ధర భారత కరెన్సీ ప్రకారం రూ.53 వేలుగా ఉంది.

డిసెంబర్ 12న విడుదల : చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. మరియు ఈ స్మార్ట్‌ఫోన్ బర్నింగ్ వే, లెజెండ్‌ ఎడిషన్‌, ట్రాక్‌ వెర్షన్, ట్రాక్‌ వేరియంట్‌ వంటి వేర్వేరు ప్రత్యేక రంగుల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. అయితే భారత్‌లోనూ ఇవే రంగుల్లో లభిస్తాయా లేదా అనేది వెల్లడి కాలేదు. భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 12న విడుదల కానుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 12 smartphone will be launched on december 12
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X