Home
News

iQOO 13 డిజైన్ లీక్ అయింది! లాంచ్ తేదీ వివరాలు

iQOO 13 కంపెనీ రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ త్వరలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు మరియు కంపెనీ ఇప్పటికే హ్యాండ్‌సెట్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్‌లను ఆన్‌లైన్‌లో టీజ్ చేయడం ప్రారంభించింది. ఒక టిప్‌స్టర్ సమాచారం ప్రకారం ఇప్పుడు iQOO 13 యొక్క లైవ్ ఫోటోలు లీక్ చేసింది.

ఈ ఫోన్ నుండి ఏమి ఆశించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. iQOO 13 స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్ చివరిలో చైనాలో ప్రారంభించబడుతుంది మరియు క్వాల్కమ్ నుండి తదుపరి తరం స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్‌తో ప్రారంభించిన మొదటి స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఒకటి.

iQOO 13 Design Specifications Leaked Through Live Photos  Expected Launch Timeline Details

iQOO 13 డిజైన్ లీక్ అయింది
ప్రముఖ చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ Weibo లో WHYLAB వినియోగదారు iQOO 13 యొక్క ఫోటోలను పోస్ట్ చేసారు. ఈ ఫోటోలు రాబోయే స్మార్ట్‌ఫోన్ యొక్క ముందు భాగాన్ని చూపుతుంది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క లైవ్ ఇమేజ్‌లు రెండు క్లోజ్ అప్ ఇమేజ్‌లతో సహా స్క్రీన్ ఎగువ మరియు దిగువ భాగాలను చూపుతాయి. ఇది ఫ్లాట్ డిజైన్‌తో పాటు నాలుగు వైపులా ఇరుకైన బెజెల్స్‌తో కనిపిస్తుంది.

ఆన్లైన్ లో లీకైన చిత్రాలు iQOO 13 లోని బటన్ అమరికపై కూడా కొంత సమాచారం అందిస్తుంది. వాల్యూమ్ రాకర్ మరియు స్క్రీన్ కుడి వైపున ఉన్న పవర్ బటన్, మెటల్ ఫ్రేమ్ ఫ్లాట్ అంచులను కలిగి ఉన్నట్లు చూపబడింది. ఈ ఫోటోలు iQOO ఎగ్జిక్యూటివ్ ద్వారా గతంలో టీజ్ చేయబడిన స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను ధృవీకరించినట్లుగా కనిపిస్తున్నాయి.

గత వారం, iQOO 13 స్మార్ట్‌ఫోన్ 2K రిజల్యూషన్‌ డిస్ప్లే తో వస్తుంది. తదుపరి తరం Q10 డిస్‌ప్లేతో అమర్చబడిందని కంపెనీ ధృవీకరించింది. iQOO నుండి వచ్చే తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 2K అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని లీక్ లు తెలియచేస్తున్నాయి.

iQOO 13 స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ యొక్క తదుపరి తరం స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది, ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 లేదా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌గా పిలిచే చిప్ సెట్ తో అక్టోబర్ 21 న ఆవిష్కరించబడుతుందని భావిస్తున్నారు. ఇది 16GB వరకు RAM మరియు 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుందని చెప్పబడింది.

మునుపటి నివేదికల ప్రకారం, ఈ iQOO 13 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, అల్ట్రావైడ్ మరియు 2x టెలిఫోటో కెమెరాలతో పాటు 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రావచ్చు. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6150mAh బ్యాటరీని కలిగి ఉంటుందని అంచనాలున్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియా ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Image Source: Weibo/WHYLAB

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO 13 Design Specifications Leaked Through Live Photos. Expected Launch Timeline Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X