iQoo 7-సిరీస్ ఫోన్‌ల ప్రీ-ఆర్డర్‌లు మొదలయ్యాయి!! రూ.3000 తగ్గింపు పొందే అవకాశం...

|

iQOO సంస్థ ఇటీవల దేశంలో సరికొత్త గేమింగ్ ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్‌లు iQOO 7 మరియు iQOO 7 లెజెండ్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లను ముందుగా కొనుగోలు చేయడం కోసం ప్రీ-ఆర్డర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ రెండు ఫోన్లు అమెజాన్ ఇండియా మరియు కంపెనీ యొక్క వెబ్‌సైట్ ద్వారా ప్రీ-ఆర్డర్‌ల ద్వారా అందుబాటులోకి రానున్నది. మీరు పొందగలిగే ఆఫర్‌లను ఇక్కడ చూడండి. ట్రిపుల్ రియర్ కెమెరా, 120Hz డిస్ప్లే వంటి ఫీచర్లతో పాటుగా పంచ్- హోల్ డిస్ప్లే డిజైన్‌, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ల గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

iQoo 7, 7 లెజెండ్ ధరల వివరాలు

iQoo 7, 7 లెజెండ్ ధరల వివరాలు

భారతదేశంలో ఐక్యూ 7 మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.31,990 కాగా 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ.33,990. చివరిగా టాప్-ఆఫ్-ది-లైన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ.35,990. ఇది స్టార్మ్ బ్లాక్ మరియు సాలిడ్ ఐస్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అలాగే ఐక్యూ 7 లెజెండ్ ఫోన్ కూడా రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.39,990 ఉండగా, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.43,990. ఇది లెజెండరీ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.

iQoo 7, 7 లెజండ్ ప్రీ-ఆర్డర్‌ సేల్స్ ఆఫర్స్

iQoo 7, 7 లెజండ్ ప్రీ-ఆర్డర్‌ సేల్స్ ఆఫర్స్

iQoo 7 మరియు iQoo 7 లెజెండ్ రెండూ అమెజాన్ మరియు iQoo.com ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. నేటి నుంచి మొదలయ్యే ప్రీ-ఆర్డర్లలో ఐక్యూ 7 యొక్క లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే అమెజాన్ లో పొందిన వారికి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఇఎంఐ లావాదేవీలపై 2 వేల తగ్గింపు, మరియు రూ.2,000 డిస్కౌంట్ కూపన్లు మరియు ఖర్చు లేని EMI ఎంపికలు లభిస్తాయి. ఈ ఫోన్‌ను ముందస్తు ఆర్డర్ చేసే వినియోగదారులకు ఈ ఆఫర్‌లు వర్తిస్తాయి. అయితే ఐక్యూ 7 లెజెండ్‌ను ప్రీ-ఆర్డరింగ్ చేసే వినియోగదారులకు రూ.3,000 డిస్కౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు మరియు ఇఎంఐ లావాదేవీలపై అమెజాన్ యొక్క రూ.2,000 డిస్కౌంట్ కూపన్లు మరియు ఖర్చు లేని EMI ఎంపికలు లభిస్తాయి.

iQoo 7 స్పెసిఫికేషన్స్

iQoo 7 స్పెసిఫికేషన్స్

ఐక్యూ 7 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో ఆరిజినోస్‌తో రన్ అవుతుంది. ఇది 6.62-అంగుళాల ఫుల్-HD + AMOLED డిస్ప్లేని 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 కారక నిష్పత్తి, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 300Hz టచ్ శాంప్లింగ్ రేటుతో కలిగి ఉంది. డిస్ప్లేలో గల స్వతంత్ర చిప్ ఫ్రేమ్‌ను మెరుగుపరచడానికి మరియు HDR కంటెంట్‌ను తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ స్మార్ట్ఫోన్లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 870 SoC తో పాటు, అడ్రినో 650 GPU ను కలిగి ఉండి 12GB వరకు LPDDR4X RAM తో జతచేయబడి ఉంది. మెరుగైన మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందించడానికి ROM యొక్క కొంత భాగాన్ని RAM గా ఉపయోగించే ఫీచర్ కూడా ఉంది.

iQoo 7

iQoo 7 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX598 సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది f / 1.79 లెన్స్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కు మద్దతును ఇస్తుంది. కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.2 అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ 13 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ లు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
iQOO 7 and 7 Legend Pre-Orders Starts Today via Amazon and Company Website: Price, Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X