iQoo 9T 5G గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ సేల్‌లో రూ.7000 వరకు డిస్కౌంట్ ఆఫర్స్...

|

iQoo కంపెనీ గతవారం భారతదేశంలో తన యొక్క తాజా iQoo 9T 5G ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ iQoo 9T 5G ఫోన్ యొక్క సేల్స్ అమెజాన్ లో ప్రారంభమయ్యాయి. ఈ కొత్త ఫోన్ క్వాల్‌కామ్ కంపెనీ యొక్క తాజా స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ఆధారితంగా రన్ అవుతూ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పంచ్ -హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది వివో V1+ ఇమేజింగ్ చిప్‌తో శక్తిని పొందుతూ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. 50-మెగాపిక్సెల్ ISOCELL GN5 ప్రైమరీ కెమెరా సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 4,700mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో ప్యాక్ చేయబడిన కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

భారతదేశంలో iQoo 9T 5G ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.49,999 కాగా ఫోన్ యొక్క 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.59,999. ఇది ఆల్ఫా మరియు లెజెండ్ కలర్ ఆప్షన్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రస్తుతం అమెజాన్ మరియు కంపెనీ యొక్క వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్స్ ఆఫర్స్

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్స్ ఆఫర్స్

అమెజాన్ సేల్‌లో భాగంగా ICICI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు ఈ డివైస్ కొనుగోలుపై రూ.4,000 తగ్గింపును పొందుతారు. ఈ తగ్గింపును పొందిన తర్వాత iQoo 9T 5G యొక్క 8GB + 128GB వేరియంట్ ని రూ.45,999 ప్రభావవంతమైన తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. అలాగే ఫోన్ యొక్క 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.50,999 ప్రభావవంతమైన తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. అదనంగా iQoo సంస్థ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలుపై అందించే ఆఫర్‌లలో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్‌ని ఎంచుకున్న వినియోగదారులు తమ పాత ఇతర ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.5,000 వరకు మరియు పాత iQoo ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.7,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందుతారు. అదనంగా, కంపెనీ పరికరం కొనుగోలుపై 12 నెలల వరకు నో-కాస్ట్ EMIని కూడా అందిస్తోంది.

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రన్ అవుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ E5 AMOLED డిస్‌ప్లేని 1,080 x 2,400 పిక్సెల్‌ల పరిమాణంతో, 1,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 100 శాతం కవరేజీని కలిగి ఉంటుంది. మృదువైన గేమింగ్ కోసం ఈ డిస్ప్లే మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కంపెన్సషన్ (MEMC) మరియు HDR10+ కి మద్దతును అందిస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCతో రన్ అవుతూ 12GB వరకు LPDDR5 ర్యామ్‌తో జతచేయబడి అందించబడుతుంది. అలాగే iQoo 9T 5Gలో వివో కంపెనీ యొక్క అంతర్గత V1+ ఇమేజింగ్ చిప్ కూడా ఉంది. గేమింగ్ సమయంలో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 3,930mm చదరపు మొత్తంలో వేడిని వెదజల్లే ప్రాంతంతో ద్రవ శీతలీకరణ ఆవిరి గదిని కూడా అందించింది.

కెమెరా సెటప్‌

కెమెరా సెటప్‌

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) హెడ్‌లైన్‌ మద్దతుతో 50-మెగాపిక్సెల్ ISOCELL GN5 ప్రైమరీ సెన్సార్ ను కలిగి ఉంటుంది. కెమెరా యూనిట్‌లో 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 12-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్ 256GB వరకు UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది.

కనెక్టివిటీ సెన్సార్ & బ్యాటరీ

కనెక్టివిటీ సెన్సార్ & బ్యాటరీ

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 5G, Wi-Fi 6, బ్లూటూత్ v5, GPS, FM రేడియో, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, మాగ్నెటోమీటర్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ వంటివి కూడా ఉన్నాయి. త్వరిత యాక్సిస్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చివరిగా ఇది 120W ఫ్లాష్‌ఛార్జ్ మద్దతుతో 4,700mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది కేవలం ఎనిమిది నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
iQoo 9T 5G Smartphone First Sales Live on Amazon: Price, Specs, Sales Offers, Bank Discounts and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X