iQoo 9T 5G గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

iQoo కంపెనీ భారతదేశంలోని మార్కెట్ లో నేడు తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా iQoo 9T 5G ను లాంచ్ చేసింది. ఈ iQoo 9 సిరీస్ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ కంపెనీ యొక్క తాజా స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ఆధారితంగా రన్ అవుతుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పంచ్ -హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది వివో V1+ ఇమేజింగ్ చిప్‌తో శక్తిని పొందుతూ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. 50-మెగాపిక్సెల్ ISOCELL GN5 ప్రైమరీ కెమెరా సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 4,700mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో ప్యాక్ చేయబడిన కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

భారతదేశంలో iQoo 9T 5G ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.49,999 కాగా ఫోన్ యొక్క 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.59,999. ఇది ఆల్ఫా మరియు లెజెండ్ కలర్ ఆప్షన్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రస్తుతం అమెజాన్ మరియు కంపెనీ యొక్క వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ.4,000 వరకు డిస్కౌంట్ ని పొందుతారు.

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్
 

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రన్ అవుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్-HD+ E5 AMOLED డిస్‌ప్లేని 1,080 x 2,400 పిక్సెల్‌ల పరిమాణంతో, 1,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 100 శాతం కవరేజీని కలిగి ఉంటుంది. మృదువైన గేమింగ్ కోసం ఈ డిస్ప్లే మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కంపెన్సషన్ (MEMC) మరియు HDR10+ కి మద్దతును అందిస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCతో రన్ అవుతూ 12GB వరకు LPDDR5 ర్యామ్‌తో జతచేయబడి అందించబడుతుంది. అలాగే iQoo 9T 5Gలో వివో కంపెనీ యొక్క అంతర్గత V1+ ఇమేజింగ్ చిప్ కూడా ఉంది. గేమింగ్ సమయంలో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం 3,930mm చదరపు మొత్తంలో వేడిని వెదజల్లే ప్రాంతంతో ద్రవ శీతలీకరణ ఆవిరి గదిని కూడా అందించింది.

ఆప్టిక్స్

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) హెడ్‌లైన్‌ మద్దతుతో 50-మెగాపిక్సెల్ ISOCELL GN5 ప్రైమరీ సెన్సార్ ను కలిగి ఉంటుంది. కెమెరా యూనిట్‌లో 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు 12-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ కెమెరాలు కూడా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్ 256GB వరకు UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది.

కనెక్టివిటీ

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 5G, Wi-Fi 6, బ్లూటూత్ v5, GPS, FM రేడియో, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, మాగ్నెటోమీటర్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ వంటివి కూడా ఉన్నాయి. త్వరిత యాక్సిస్ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చివరిగా ఇది 120W ఫ్లాష్‌ఛార్జ్ మద్దతుతో 4,700mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది కేవలం ఎనిమిది నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

iQoo 10 Pro స్పెసిఫికేషన్‌లు

iQoo 10 Pro స్పెసిఫికేషన్‌లు

iQOO 10 ప్రో స్మార్ట్‌ఫోన్ కు సంబందించిన స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ప్రో వెర్షన్ 2K LTPO డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్, 200W వైర్డ్ ఛార్జింగ్ మరియు 65W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ప్రో మోడల్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది QHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అలాగే iQOO 10 ప్రో మోడల్ ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఆరిజిన్OS తో రన్ అవుతూ బాక్స్ వెలుపల బూట్ చేయబడి వస్తుంది. చివరగా ఇది 200W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,550mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి రావచ్చు అని భావిస్తున్నారు. iQOO 10 ప్రో మోడల్ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 16GB వరకు LPDDR5 RAM మరియు 512GB వరకు UFS 3.1 స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ పరంగా ఫోన్ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 14.6MP టెలిఫోటో కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
iQoo 9T 5G Smartphone Launched in India With Snapdragon 8+ Gen 1 SoC and 120W FlashCharger: Price, Specs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X