IQOO Neo 3: ఏప్రిల్ 23న లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ అదుర్స్....

|

వివో సంస్థ యొక్క సబ్-బ్రాండ్ సంస్థగా ఇండియాలోకి అడుగుపెట్టిన ఐక్యూఓ సంస్థ ఇప్పుడు కొత్తగా తన రెండవ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నది. ఐక్యూఓ నుబియా రెడ్ మ్యాజిక్ 5G స్మార్ట్‌ఫోన్ యొక్క అప్ గ్రేడ్ వెర్షన్ గా వస్తున్న ఐక్యూఓ నియో 3 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 23 న లాంచ్ కానున్నది.

 

ఐక్యూఓ టీజర్

ఐక్యూఓ ఇంకా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించకపోగా తాజా టీజర్ ఫోన్‌ను "4.23 రాబోయే" ట్యాగ్‌తో చూపిస్తుంది. అంటే ఐక్యూఓ నియో 3 5G యొక్క లాంచ్ ఏప్రిల్ 23 న జరుగుతుందని ఇది సూచిస్తుంది. సంస్థ విడుదల చేసిన టీజర్ ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ యొక్క కొన్ని వివరాలను కూడా వెల్లడించింది.

 

 

WhatsApp గ్రూప్ నోటిఫికేషన్లను మ్యూట్ చేయడం ఎలా?WhatsApp గ్రూప్ నోటిఫికేషన్లను మ్యూట్ చేయడం ఎలా?

ఐక్యూఓ నియో 3 5G స్మార్ట్‌ఫోన్‌
 

ఐక్యూఓ నియో 3 5G స్మార్ట్‌ఫోన్‌

ఐక్యూఓ నియో 3 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా నుబియా రెడ్ మ్యాజిక్ 5G మాదిరిగానే 144HZ డిస్ప్లేను కలిగి ఉంటుంది. రాబోయే iQOO స్మార్ట్‌ఫోన్ ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoCతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇదే చిప్‌సెట్ ఏప్రిల్ 14 న విడుదల కానున్న వన్‌ప్లస్ 8 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 5G స్మార్ట్‌ఫోన్‌ UFS 3.1 ఫ్లాష్ మెమరీ మరియు LPDDR5 మెమొరీతో వస్తుంది.

 

 

Instagram యొక్క సరి కొత్త ఫీచర్ ఏమిటో చూడండి....Instagram యొక్క సరి కొత్త ఫీచర్ ఏమిటో చూడండి....

 iQOO నియో 3 5G డిజైన్‌

iQOO నియో 3 5G డిజైన్‌

మునుపటి లీక్‌లు మరియు పుకార్ల ప్రకారం iQOO నియో 3 5G స్మార్ట్‌ఫోన్ పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్‌తో రానున్నది. చాలా బ్రాండ్లు వృత్తాకార కటౌట్‌తో పరికరాలను ప్రారంభిస్తున్నాయి. అలాగే వన్‌ప్లస్ 8 సిరీస్‌లో కూడా పంచ్-హోల్ డిస్ప్లే డిజైన్ తో తయారుచేసినట్లు సమాచారం.

 

 

Apple ఫ్యూచర్ స్మార్ట్‌వాచ్‌లో ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూడండి!!!!Apple ఫ్యూచర్ స్మార్ట్‌వాచ్‌లో ఫీచర్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో చూడండి!!!!

iQOO నియో 3 5G  సెన్సార్‌

iQOO నియో 3 5G సెన్సార్‌

iQOO నియో 3 5G స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చినట్లు చెబుతున్నారు. ఇది హుడ్ కింద 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి రాబోతున్నట్లు సమాచారం. అలాగే ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో రానున్నది. నియో 3 ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెట్ అప్ ను జోడించాలని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రానున్నది. చైనీస్ బ్రాండ్ తన కొత్త ఐక్యూ ఫోన్‌ను 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌మోడల్ తో అందించనున్నది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 10 తో రన్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది.

Best Mobiles in India

English summary
IQOO Neo 3 Launch on April 23 : Price, Specifications and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X