iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...

|

ప్రముఖ iQoo స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ తన యొక్క పోర్ట్‌ఫోలియోలో జోడింపుగా నేడు ఇండియాలో iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. iQoo నియో కొత్త స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 870 SoCతో రన్ అవుతూ గరిష్టంగా 12GB RAMతో జత చేయబడి వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఏప్రిల్‌లో మొదటగా చైనాలో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC ఫీచర్లతో లాంచ్ చేయబడింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62-అంగుళాల E4 AMOLED డిస్‌ప్లే, 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 80W ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో 4,700mAh బ్యాటరీ వంటి ఫీచర్ల సమ్మేళనంతో లభించే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ ధరలు & లాంచ్ ఆఫర్ల వివరాలు

iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ ధరలు & లాంచ్ ఆఫర్ల వివరాలు

భారతదేశంలో iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ యొక్క ధర రూ.29,999 కాగా 12GB ర్యామ్ + 256GB హై-ఎండ్ వేరియంట్ యొక్క ధర రూ.33,999. ఇది సైబర్ రేజ్ మరియు డార్క్ నోవా కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది అమెజాన్ మరియు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుండి సేల్స్ మొదలయ్యాయి. కస్టమర్‌లు జూన్ 5 వరకు లాంచ్ ఆఫర్‌లను పొందవచ్చు. ఇందులో ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌ల యూజర్లు EMI లావాదేవీలను ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,000 తగ్గింపును పొందవచ్చు. అదనంగా అమెజాన్ కూపన్ల ద్వారా రూ.1,000 తగ్గింపు మరియు అదనపు ఎక్స్ఛేంజ్ లలో భాగంగా రూ.3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఫన్ టచ్ OS 12లో రన్ అవుతుంది. ఇది 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.62-అంగుళాల ఫుల్-HD+ E4 AMOLED డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా ఆధారితమై గరిష్టంగా 12GB RAMతో జత చేయబడి వస్తుంది. అలాగే గేమింగ్ సమయంలో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇది లిక్విడ్ కూలింగ్ చాంబర్‌ను కలిగి ఉంటుంది.

ఆప్టిక్స్

iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో శామ్సంగ్ ISOCELL GW1P ప్రైమరీ సెన్సార్‌తో f/1.89 అపెర్చర్ లెన్స్‌తో 64-మెగాపిక్సెల్ మరియు f/2,2 ఎపర్చరు లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మరియు f/2.4 ఎపర్చరు లెన్స్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. ఇవి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం f/2.0 ఎపర్చరు లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో బయోమెట్రిక్ యాక్సిస్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మాగ్నెటోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. చివరిగా ఇది 256GB వరకు UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉండి 80W ఫ్లాష్ ఛార్జ్ మద్దతుతో 4,700mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Best Mobiles in India

English summary
iQoo Neo 6 Smartphone Launched in India With Snapdragon 870 SoC: Price, Specifications, Launch Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X