iQoo Neo 7 లాంచ్ డేట్ విడుదలైంది. స్పెసిఫికేషన్లు మరియు ఇతర వివరాలు.

By Maheswara
|

iQoo Neo 7 స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 20న లాంచ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ Vivo సబ్-బ్రాండ్ చైనాలో త్వరలో విడుదల చేయబోయే గేమింగ్ ఫోకస్‌తో తయారు చేసిన ఈ హ్యాండ్‌సెట్ యొక్క ప్రధాన వివరాలను Weibo లో పోస్ట్ చేసింది. భవిష్యత్తులో iQoo Neo 7 కోసం Samsung E5 AMOLED డిస్‌ప్లే ను తీసుకురానున్నట్లు టీజ్ చేయబడింది. ఫోన్ లో గేమ్‌లు ఆడుతున్నప్పుడు మెరుగైన పవర్ మేనేజ్‌మెంట్ కోసం, ఇది ప్రో+ డిస్‌ప్లే చిప్‌తో వస్తుంది. 120W వేగవంతమైన ఛార్జింగ్ సామర్ధ్యంతో 5,000mAh బ్యాటరీ iQoo Neo 7కి శక్తినిస్తుంది. ఒక MediaTek డైమెన్సిటీ 9000+ SoC నిస్సందేహంగా లోపల ఇన్‌స్టాల్ చేయబడుతుందని అంచనాలున్నాయి.

 

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్లు

iQoo తన అధికారిక Weibo ఖాతాలో iQoo చేసిన అనేక ప్రకటనల ప్రకారం, iQoo Neo 7 స్మార్ట్ ఫోన్ Samsung E5 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలతో 5,000mAh బ్యాటరీ దీనికి శక్తినిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వేడిని నిర్వహించడానికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ మరియు ఇండిపెండెంట్ డిస్‌ప్లే చిప్ ప్రో+ ఉంటుంది. టీజర్ పోస్టర్‌ల ప్రకారం గమనిస్తే ఈ పరికరం ఆరెంజ్ కలర్, హోల్ పంచ్ డిస్‌ప్లే మరియు వెనుకవైపు LED ఫ్లాష్‌తో ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉన్నట్లు వర్ణించాయి.

MediaTek Dimensity 9000+ SoC, 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్, Neo 7కి శక్తిని ఇస్తాయని ఇప్పటికే మీకు తెలుసు. ఇది బెంచ్‌మార్క్ AnTuTu స్కోర్ 10,80,717ని కలిగి ఉందని నిర్ధారించబడింది.

లాంచ్ వివరాలు

లాంచ్ వివరాలు

iQoo Neo 7 అక్టోబర్ 20న చైనాలో విడుదల కానుందని కంపెనీ గతంలో చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ లాంచ్ ఈవెంట్ రాత్రి సమయం 7 గంటలకు జరగనుంది. స్థానిక సమయం ప్రకారం (సాయంత్రం 4:30 IST). ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం వివో చైనా వెబ్‌సైట్ మరియు డౌయిన్, జింగ్‌డాంగ్, సునింగ్ మరియు టిమాల్ వంటి ఇతర ముఖ్యమైన ఆన్‌లైన్ స్టోర్‌లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది.

అంచనాల ప్రకారం
 

అంచనాల ప్రకారం

అంచనాల ప్రకారం, iQoo Neo 7 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదనంగా, ఇది 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మరియు 50-మెగాపిక్సెల్ సోనీ IMX 766V ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉండవచ్చు. ఇంకా,ఇతర ఊహించిన ఫీచర్లు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఒక IR బ్లాస్టర్ మరియు NFC కూడా ఉన్నాయి.

iQoo 9T 5G

iQoo 9T 5G

ఇటీవల, iQoo నుంచి ఇండియా లో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా iQoo 9T 5G ను లాంచ్ చేసింది.ఈ iQoo 9 సిరీస్ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ కంపెనీ యొక్క తాజా స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ఆధారితంగా రన్ అవుతుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పంచ్ -హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇది వివో V1+ ఇమేజింగ్ చిప్‌తో శక్తిని పొందుతూ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. 50-మెగాపిక్సెల్ ISOCELL GN5 ప్రైమరీ కెమెరా సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 4,700mAh బ్యాటరీ వంటి అద్భుతమైన ఫీచర్లతో ప్యాక్ చేయబడింది.

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ ధరలు

iQoo 9T 5G స్మార్ట్‌ఫోన్‌ ధరలు

భారతదేశంలో iQoo 9T 5G ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్ లలో లాంచ్ అయింది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.49,999 కాగా ఫోన్ యొక్క 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.59,999. ఇది ఆల్ఫా మరియు లెజెండ్ కలర్ ఆప్షన్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
iQoo Neo 7 Launch Date Confirmed For October 20. Expected Specifications And Price Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X