Home
News

iQOO నియో సిరీస్ లో మరో కొత్త ఫోన్! ధర & లాంచ్ వివరాలు లీక్ 

By Maheswara

iQOO నియో 7 ప్రో జూన్ చివరి నాటికి భారతదేశంలో లాంచ్ చేయబడుతుందని అంచనాలున్నాయి. అదే సమయంలో, నథింగ్ ఫోన్ (2) కూడా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కొత్త 5G ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన iQOO Neo 7 స్మార్ట్ ఫోన్ కి అప్‌గ్రేడ్ గా వస్తుంది.

ఇది క్వాల్కమ్ యొక్క ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని ఉపయోగిస్తుందని మరియు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ కోసం మద్దతును అందిస్తుందని చెప్పబడింది. ఊహించిన ధర మరియు స్పెసిఫికేషన్ల వివరాల ప్రకారం రాబోయే iQOO ఫోన్ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయం ఇక్కడ ఉంది.

iQOO Neo 7 Pro Expected To Launch In Indian Market By June End. Price And Specifications Leaked.

iQOO నియో 7 ప్రో: భారతదేశంలో అంచనా ధర
iQOO నియో 7 ప్రో భారతదేశంలో లాంచ్ అయినప్పుడు దాని ధర రూ. 40,000 లోపు ఉంటుందని భావిస్తున్నారు. ఇది iQOO నియో 7 స్మార్ట్‌ఫోన్ యొక్క అధునాతన వెర్షన్ కాబట్టి, ధర దీని కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.

నియో 7 భారతదేశంలో రూ.29,999 ప్రారంభ ధరతో లాంచ్ చేయబడుతుంది. ఈ ఫోన్ యొక్క ప్రో వెర్షన్ ధర రూ. 40,000 సెగ్మెంట్ లో వస్తుంది. ఎందుకంటే ఇది ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ మరియు ఆఫర్ ప్రీమియం ఫీచర్లను ఉపయోగిస్తుంది. రాబోయే iQOO నియో ఫోన్ అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి మీకు అందుబాటులో ఉంటుంది.

iQoo నియో 7 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క లీకైన స్పెసిఫికేషన్‌ల వివరాలు
త్వరలో రాబోయే iQoo నియో 7 ప్రో స్మార్ట్ ఫోన్, 6.78-అంగుళాల FHD+ శాంసంగ్ E5 అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనాలు తెలియచేస్తున్నాయి. ఈ డిస్ప్లే ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్‌సెట్‌ను ప్యాక్ చేస్తుందని చెప్పబడింది. ఇది ఫ్లాగ్‌షిప్ చిప్ సెట్ కేటగిరీ లో వస్తుంది. ఈ చిప్సెట్ ఇంకా అనేక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో వస్తుంది.

ఇది చాలా శక్తివంతమైనది మరియు ఈ చిప్ యొక్క ఉపయోగం కూడా ధర ఎక్కువగా ఉంటుందని సూచిస్తుంది. రాబోయే నథింగ్ ఫోన్ 2 కూడా అదే చిప్‌ని ఉపయోగిస్తుందని మరియు ఇది కూడా జూన్‌లో ప్రారంభించబడుతుందని చెప్పబడింది. ఇది 12GB RAM మరియు 256GB స్టోరేజీ తో వస్తుంది.

ఇక కెమెరా ఆప్టిక్స్ పరంగా వివరాలు గమనిస్తే, iQoo నియో 7 ప్రో OIS మద్దతుతో Samsung GN5 సెన్సార్‌తో వెనుకవైపు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇతర కెమెరా సెన్సార్ల గురించిన వివరాలు ప్రస్తుతం తెలియవు. ఈ 5G స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో మద్దతునిస్తుందని చెప్పబడింది మరియు కంపెనీ రిటైల్ బాక్స్‌లో 120W ఫాస్ట్ ఛార్జర్‌ ను తీసుకువస్తుందని. మిగిలిన వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. మీరు రాబోయే ఈ iQOO ఫోన్ గురించి త్వరలో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి గిజబోట్ తెలుగు ను అనుసరించండి.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Neo 7 Pro Expected To Launch In Indian Market By June End. Price And Specifications Leaked.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X