Home
News

iQOO నియో 7 ప్రో ఇండియా లాంచ్ ఎప్పుడంటే..! వివరాలు

By Maheswara

iQOO నియో 7 ప్రో స్మార్ట్ ఫోన్ ని భారతదేశంలో జూలై 4న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఈరోజు ప్రకటించింది. ఫిబ్రవరిలో సంస్థ నుంచి దేశంలో లాంచ్ అయిన నియో 7 ఫోన్ తర్వాత ఈ ఫోన్ రాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ లను iQOO సంస్థ ఇంకా నిర్ధారించలేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ పనితీరును అధికంగా ఇష్టపడే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.

ఇది iQOO Neo 7 యొక్క ప్రో మోడల్ కాబట్టి, మనము కొన్ని గణనీయమైన అప్‌గ్రేడ్‌ ఫీచర్లను ఆశించవచ్చు. ఈ నెల ప్రారంభంలో, MySmartPrice నివేదిక ప్రకారం ఈ నియో 7 ప్రో స్మార్ట్ ఫోన్, నియో 7 రేసింగ్ ఎడిషన్ యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ అని నివేదిక తెలిపింది. ఇది గత సంవత్సరం చైనాలో లాంచ్ చేయబడింది. Neo 7 రేసింగ్ ఎడిషన్‌లో Neo 8 5G లో లేని అదనపు కెమెరా ఫీచర్లు ఉన్నందున ఇది భారతదేశంలోని వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.

iQOO Neo 7 Pro India Launch Date Confirmed For July 4. Expected To Feature 50MP OIS Camera.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అంచనా స్పెసిఫికేషన్లను గమనిస్తే, iQOO Neo 7 Pro పూర్తి HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని మేము ఆశించవచ్చు. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 SoC మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీతో రావొచ్చు. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే, నియో 7లో డైమెన్సిటీ 8200 5G కంటే గణనీయమైన అప్‌గ్రేడ్ కలిగి ఉంటుంది.

iQOO నియో 7 ప్రో స్మార్ట్ ఫోన్ నియో 7 రేసింగ్ ఎడిషన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అయితే దీని వెనుకవైపు మూడు కెమెరా సెన్సార్‌లను కలిగి ఉండవచ్చు. ఇంకా, కెమెరా సిస్టమ్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా సెన్సార్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉండవచ్చు. ఇక ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

ఇది 5G, ఆండ్రాయిడ్ 13 ఆధారిత Funtouch OS 13, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్, డ్యూయల్-సిమ్, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, స్టీరియో స్పీకర్లు మరియు 16GB వరకు ర్యామ్ + 256GB స్టోరేజి వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లతో వస్తుందని అంచనాలున్నాయి.

ఈ ఫోన్ యొక్క ఇతర స్పెసిఫికేషన్లను గమనిస్తే, iQOO నియో 7 ప్రో ధర సుమారు రూ. 40,000 ఉండవచ్చు. అదే సమయంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఇతర స్మార్ట్‌ఫోన్ OEMల నుండి పోటీ ని ఎదుర్కొంటుంది. ఉదాహరణకు, వచ్చే నెలలో అదే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో నథింగ్ ఫోన్ (2) లాంచ్‌ను కూడా అంచనా వేయవచ్చు. అయినప్పటికీ, ఈ ఫోన్ యొక్క దాని సొగసైన డిజైన్ మరియు ఎక్కువ సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్ సపోర్ట్ కారణంగా ఇది ధర ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు.

iQOO నియో 7 ప్రో ఫోన్ , నియో 7 లాగానే కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఈ ఫోన్ వెనుక భాగంలో గ్లాస్ లాంటి డిజైన్ ను అందిస్తుంది మరియు ట్రిపుల్ రియర్ కెమెరాలను చదరపు మాడ్యూల్‌లో ఉంచవచ్చు. ఇంకా, iQOO నుండి రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో విడుదలవుతాయని ఆశిద్దాం.

Best Mobiles in India

English summary
iQOO Neo 7 Pro India Launch Date Confirmed For July 4. Expected To Feature 50MP OIS Camera.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X