64MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ iQOO స్మార్ట్‌ఫోన్‌పై రూ.3000 తగ్గింపు..!
ఐకూ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ ఐకూ నియో 9 ప్రో త్వరలో భారత్‌లో విడుదల కానుంది. ఈ కొత్త ఫోన్ల విడుదల సందర్భంగా తన మోడల్ హ్యాండ్‌సెట్‌పై ఐకూ ధర తగ్గించింది. భారత్‌లో ఐకూ నియో 7 (IQOO Neo 7) స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత సంవత్సరం విడుదల అయింది.
ఐకూ నియో 7 స్మార్ట్‌ఫోన్ ఇప్పటి వరకు ఒకసారి ధర తగ్గింపు ప్రకటన వెలువడగా తాజాగా రెండోసారి ఈ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధరను రూ.3000 తగ్గించారు. ఈ హ్యాండ్‌సెట్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెండింటిపైనా తగ్గింపు ధర ప్రకటన వర్తించనుందని సంస్థ వెల్లడించింది.

ఐకూ నియో 7 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.27999గా ఉంది. అదే 12GB వేరియంట్ ధర రూ.30999గా ఉంది. తాజాగా రూ.3వేల తగ్గింపు ధరతో.. 8GB ర్యామ్ వేరియంట్‌ను రూ.24999కు కొనుగోలు చేయవచ్చు. అదే 12GB ర్యామ్ వేరియంట్‌ను రూ.27999కు సొంతం చేసుకోవచ్చు.
ఐకూ నియో 7 ర్యామ్, స్టోరేజీ వేరియంట్లు : ఐకూ నియో 7 స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్+ 256GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మరియు బ్లాక్ మరియు ఫ్రాస్ట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్లు కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

ఐకూ నియో 7 స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల పుల్ HD+ శాంసంగ్ ES అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మరియు 1500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ తరహా చిప్‌సెట్‌ను కలిగి ఉన్న తొలి ఐకూ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం గమనార్హం.
ఐకూ నియో 7 స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 64MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దాంతోపాటు 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ముందువైపు 16MP కెమెరాలను కలిగి ఉంది.
ఐకూ నియో 7 బ్యాటరీ వివరాలు : ఐకూ నియో 7 హ్యాండ్‌సెట్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఛార్జర్ ద్వారా 50శాతం ఛార్జింగ్‌ను కేవలం 10 నిమిషాల్లోనే చేయవచ్చు. దీంతోపాటు ఈ బ్యాటరీ ఎక్కువకాలం మన్నిక వస్తుందని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








