Home
News

12GB ర్యామ్‌, 5160mAh బ్యాటరీతో iQOO కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఇవాళ్టి నుంచి బుకింగ్‌లు ప్రారంభం..!

ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ (iQoo Neo 9 Pro) ఫిబ్రవరి 22న భారత్‌లో లాంచ్‌ కానుంది. ఈ మోడల్‌ 2023 డిసెంబర్‌లోనే చైనాలో విడుదల అయింది. IQoo Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్‌, కెమెరా, ప్రాసెసర్‌ వంటి వివరాలు ఇప్పటికే అధికారంగా బయటకు వచ్చాయి. ర్యామ్‌ మరియు స్టోరేజీ వేరియంట్లను కూడా సంస్థ వెల్లడించింది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర లీక్‌ అయింది.

ముందస్తు బుకింగ్‌ వివరాలు : ఈ ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ముందస్తు బుకింగ్‌లు ఇవాళ్టి మధ్యాహ్నం (ఫిబ్రవరి 8) 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ను ఐకూ ఇండియా వెబ్‌సైట్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. రిఫండ్‌బుల్‌ నగదు రూ.1000 చెల్లించి బుకింగ్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.1000 తగ్గింపును పొందవచ్చు.

IQoo Neo 9 Pro smartphone pre bookings will start Feb 8 in india

ధర వివరాలు లీక్‌ : ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ ధరను టిప్‌స్టర్‌ ముకుల్‌ శర్మ తన X ఖాతా ద్వారా వెల్లడించారు. దీని ఆధారంగా ఐకూ కొత్త ఫోన్ 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.37,999 గా ఉంది. బ్యాంక్‌ ఆఫర్ ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చని తెలిపారు. ఫలితంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.34999 కే సొంతం చేసుకోవచ్చని వెల్లడించారు.

అయితే ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర వివరాలు వెల్లడికాలేదు. అయితే కొన్ని నివేదికల ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.40,000 లోపల ఉండే అవకాశం ఉంది. అయితే ధరలపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. స్మార్ట్‌ఫోన్‌ ‌గ్లోసీ ఫినిష్‌తో కాంక్విరర్‌ బ్లాక్‌, డ్యూయల్‌ టోన్ ఫాక్స్‌ లెదర్‌తో ఫైరీ రెడ్‌ బ్యాక్‌ ప్యానల్‌ను కలిగి ఉంటుంది.

ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.78 అంగుళాల LTPO అమోలెట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 144Hz రీఫ్రెష్‌ రేట్‌ మరియు 3000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మరియు స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌తో సూపర్‌ కంప్యూటింగ్‌ Q1 చిప్‌ జతచేయబడి ఉంటుంది. ఈ చిప్‌ గేమింగ్‌ అనుభూతిని మెరుగుపరుస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. ఆప్టికల్‌ ఇమేజ్ స్టెబిలేజేషన్‌ సపోర్టు (OIS) తో 50MP IMX920 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌ను కలిగి ఉంటుంది. 120W వైరడ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5160mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

IQoo Neo 9 Pro smartphone pre bookings will start Feb 8 in india

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
IQoo Neo 9 Pro smartphone price leaked and here are the conformed specs and pre booking details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X