iQOO : ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్.. 6.78 అంగుళాల డిస్‌ప్లే, 12GB ర్యామ్ సహా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐకూ నుంచి త్వరలో IQOO Neo 9 Pro స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఐకూ నియో 9 హ్యాండ్‌సెట్ స్పెసిఫికేషన్లు ఇప్పటికే విడుదల కాగా.. తాజాగా ఐకూ 9 ప్రో స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్ ద్వారా విడుదల అయ్యాయి. అయితే ఈ ఫోన్ తొలుత చైనాలో విడుదల కానుందని తెలుస్తోంది. అనంతరమే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలుస్తోంది.
ఐకూ నియో 9 ప్రో ఫీచర్లు : ఈ హ్యాండ్‌సెట్ మీడియా టెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్ మెరుగైన పనితీరును కనబరుస్తుంది. మరియు ఈ నియో 9 ప్రో.. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పైన పనిచేస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లు సహా సెక్యూరిటీ అప్‌డేట్‌లను త్వరలో అందుకుంటుందని తెలిపింది.

ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే : ఈ ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ 144Hz రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ సహా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 50MP సోనీ IMX920 సెన్సార్+ 50MP అల్ట్రా వైడ్ డ్యూయల్ రేర్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 16MP కెమెరాను కలిగి ఉంటుంది. మరియు LED ప్లాష్‌ను కలిగి ఉంటుంది.

ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ వివరాలు : ఐకూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256 GB అంతర్గత స్టోరేజీ మరియు 16GB ర్యామ్, 512GB స్టోరేజీ రెండు వేరియంట్లలోనే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. మైక్రో SD కార్డుతో స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది. ఐకూ కొత్త స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
చాలా స్మార్ట్‌ఫోన్లు గేమింగ్ సమయంలో వేడెక్కుతాయి. దాన్ని నివారించేందుకు ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్ సరికొత్త కూలింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. కెనెక్టివిటీ విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్ 5G, డ్యూయల్ 4G VolTE, వైఫై 6, బ్లూటూత్ 5.2, GPS, NFC సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ధరపై ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. అయితే కాస్త ఎక్కువ ధరకు లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్‌లో ఐకూ స్మార్ట్‌ఫోన్లను మంచి మార్కెట్ ఉంది. ఈ ఫోన్ కూడా గణనీయమైన సంఖ్యలో విక్రయాలను నమోదు చేస్తుందని ఐకూ సంస్థ భావిస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








