Home
News

iQOO కొత్త ఫోన్‌ Neo 7 Pro 5G ఫోటోలు లీక్‌.. విడుదల ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థ iQOO నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌పై రకరకాల ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ డిజైన్‌, ఫీచర్లు కొన్ని లీక్‌ అయ్యాయి. అయితే ఈ ఫోన్‌ iQOO Neo 7 Pro 5G ‌భారత్‌లో లాంచ్‌ కానుంది. ఈ ఫోన్ ఈ నెలలోనే లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. iQOO నియో 7 ప్రో మరిన్ని వివరాలు మీకోసం.

కొన్ని లీకేజీల ప్రకారం iQOO నియో 7 ప్రో 5G ఫోన్ టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ 16GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీతో రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేరియంట్ ఫోన్‌ కేవలం నలుపు రంగులోనే అందుబాటులో ఉండే అవకాశం ఉందని సమాచారం.

iQOO Neo 7 Pro 5G

IQOO నియో 7 ప్రో 5G ఫోన్‌ 6.78 అంగుళాల 1.5 OLED స్క్రీన్‌తో రానుందని సమాచారం. మరియు 144Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉండనుందని తెలుస్తోంది. మరియు 1300 nits డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌తో రానుందని సమాచారం. స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌ 1 SoC ఆధారంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ పనిచేయనుందని తెలుస్తోంది. మరియు ఆండ్రాయిడ్‌ 13పై పనిచేయనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ స్మార్ట్‌ ఫోన్. 50MP OIS ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలు మరియు ఫోన్‌ ముందువైపు 16MP సెల్ఫీ కెమెరా అమర్చినట్లు సమాచారం. డిస్‌ప్లే కిందనే సెల్ఫీ కెమెరా అమర్చినట్లు లీకేజీ ఫోటోల ద్వారా తెలుస్తోంది.

iQOO స్మార్ట్‌ ఫోన్‌ 5000mAh బ్యాటరీ సామర్థ్యం మరియు 120W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రానుందని సమాచారం. వీటితోపాటు ఈ ఫోన్‌ WiFi 6, బ్లూటూత్‌ 5.3 ఫీచర్లతో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఈ ఫోన్ బరువు 190 గ్రాముల నుంచి 195 గ్రాముల మధ్య ఉండవచ్చని సమాచారం. లీకైన ఫోటోల ఆధారంగా ఈ ఫోన్‌ బ్లాక్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ రంగుల్లో అందుబాటులో అండే అవకాశం ఉంది.

iQOO నియో 7 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.38,000- 42.000 రూపాయల మధ్య అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ భారత్‌లో అధికారికంగా జూన్‌ 20 విడుదల కానుందని తెలుస్తోంది. అయితే సంస్థ ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు.

iQOO నుంచి ఫిబ్రవరిలో నియో 7 5G ఫోన్‌ లాంచ్‌ అయింది. 8GB ర్యామ్‌, 128GB స్టోరేజీ వేరియంట్‌ 29,999 రూపాయలు, మరియు 12GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర 33,999 అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 6.78 అంగుళాల పుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
iQOO New Smart Phone Neo 7 Pro 5G may launch june 20 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X