Home
News

iQOO Pad 2 ఐకూ నుంచి కొత్త ప్యాడ్‌... స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, లాంచ్ వివరాలు..!

ఐకూ ప్యాడ్‌ 2 (iQOO Pad 2) భారత్‌ మార్కెట్లో లాంచ్‌ కానుంది. ఐకూ ప్యాడ్‌ తర్వాత వెర్షన్‌గా వస్తుంది. అయితే ఈ మోడల్‌ విడుదలపై సంస్థ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోయినా.. కొన్ని లీక్‌ల ఆధారంగా ఐకూ ప్యాడ్‌ 2 ఈ సంవత్సరంలోనే లాంచ్‌ కానుందని తెలుస్తోంది. మరియు ఈ ఐకూ కొత్త ప్యా్డ్‌ త్వరలో అందుబాటులోకి రానున్న వివో ట్యాబ్లెట్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా ఉంటుందని తెలుస్తోంది.

ఐకూ ప్యాడ్‌ 2 స్పెసిఫికేషన్లు..! : కొన్ని నివేదికలు, లీక్‌ల ఆధారంగా ఈ ఐకూ ప్యాడ్‌ 2.. మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ చిప్‌సెట్‌ Mail G720 MP12 GPU తో జతచేయబడి ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ ఐకూ ప్యాడ్‌ 2 కూడా పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.

iQOO Pad 2 may soon launch in india here are the specs expected

ట్యాబ్లెట్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా : ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐకూ ప్యాడ్‌ 12.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 2.8k LCD స్క్రీన్‌తో లాంచ్‌ అయింది. దీంతోపాటు టిప్‌స్టర్‌ అంచనా ప్రకారం ఈ ఐకూ ప్యాడ్‌ 2 మోడల్‌ నంబర్‌ PA2473 ను కలిగి ఉండే అవకాశం ఉందని మరియు వివో ప్యాడ్‌ 3 ప్రో ట్యాబ్లెట్‌కు రీబ్రాండెడ్‌ వెర్షన్‌గా వచ్చే అవకాశం ఉంది.

వివో ప్యాడ్‌ 3 ప్రో.. 3096*2064 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 12.95 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 144Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా మీడియాటెక్‌ డైమెన్సిటీ 9300 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ చిప్‌సెట్‌ 16GB ర్యామ్‌ మరియు 512GB అంతర్గత స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది.

* భారత్‌ మార్కెట్‌లో ఇవాళ ఐకూ సంస్థ తన ఐకూ Z9 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత FuntouchOS 14 పైన పనిచేస్తుంది. మరియు 6.67 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా 394 ppi పిక్సల్‌ డెన్సిటీతో వస్తుంది. మరియు 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.

ఈ ఐకూ Z9 స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా కోర్‌ 4nm మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 5G SoC ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ 8GB LPDDR4x ర్యామ్‌ మరియు Mail G610 GPU జతచేయబడుతుంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌ +128GB స్టోరేజీ, 8GB ర్యామ్ +256GB స్చోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

ఈ కొత్త ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX88 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా f/1.79 అపేచర్‌తో OIS సపోర్టుతో వచ్చింది. మరియు f/2.4 అపేచర్‌తో 2MP బోకేష్ కెమెరాను అమర్చారు. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌ 16MP కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
iQOO Pad 2 may soon launch in india here are the specs expected
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X