iQOO Quest Days 2023.. ఐకూ స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ ఆఫర్లు.. లిస్ట్!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐకూ నుంచి డిసెంబర్ 12న iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ కానుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ OS 14 పై పనిచేస్తుంది. తాజాగా iQOO Quest Days 2023 సేల్ పేరుతో ప్రత్యేక సేల్ అమెజాన్‌లో నడుస్తోంది. ఈ నెల 30 వరకు సేల్ అందుబాటులో ఉంటుంది.
ఇందులో భాగంగా ఐకూ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై రూ.15 వేలు వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2000 తక్షణ డిస్కౌంట్‌ను పొందుతారని ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్లపై 6 నెలల వరకు నో కాస్ట్ EMI ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

iQOO 11 5G : ఐకూ 11 5G స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ మరియు 2K E6 అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ OSను కలిగి ఉంటుంది. మరియు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో రానుంది. గేమింగ్ కోసం V2 చిప్‌ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. 50MP OIS ( ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ) + 8MP+ 13MP కెమెరాలను అమర్చారు. ముందువైపు సెల్ఫీ, వీడియో కాల్ కోసం 16MP కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.49,999గా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు రూ.2999 విలువైన వివో TWS Air ఇయర్‌బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు.
iQOO Neo 7 Pro 5G : ఐకూ నియో 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మరియు స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్, మరియు ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ OSను కలిగి ఉంటుంది.
నియో 7 ప్రో.. 120W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు 50MP OIS- ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా సహా 8MP+2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. ముందువైపు 16MP కెమెరాలను కలిగి ఉంటుంది.
iQOO Z7 Pro 5G : ఐకూ Z7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ కర్వడ్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4nm డైమెన్సిటీ 7200 చిప్, ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ OS 13 పైన పనిచేస్తుంది. 66W ఛార్జింగ్ సపోర్టుతో 4600mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 64MP OIS కెమెరా, 2MP కెమెరాలను కలిగి ఉంటుంది. ముందు వైపు 16MP కెమెరాతో వస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్‌ను రూ.21999కు కొనుగోలు చేయవచ్చు. ఐకూ క్విస్ట్ డేస్ 2023 సేల్ ఈనెల 30 వరకు అందుబాటులో ఉంది.
iQOO Z7s 5G : ఐకూ Z7s స్మార్ట్‌ఫోన్ 6.38 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90Hz డిస్‌ప్లే రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 6nm స్నాప్‌డ్రాగన్ 695 CPU చిప్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ 13 పైన పనిచేస్తుంది.
44W ఛార్జింగ్ సపోర్టుతో 4500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మరియు 64MP OIS + 2MP వెనుక కెమెరాలను కలిగి ఉంటుంది. ముందు వైపు 16MP కెమెరాలతో వస్తుంది. ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.15999కు కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications